నందమూరి తారకరత్నకి లోకేష్ పాదయాత్రలో కార్డియా అరెస్ట్ కావడంతో ఆయనని కుప్పం ఆసుపత్రి నుండి బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పదిమంది డాక్టర్స్ పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స జరుగుతుంది. నందమూరి బాలకృష్ణ ఆసుపత్రి వద్దే ఉండి తారకరత్న చికిత్సని పర్యవేక్షిస్తున్నారు. అయితే నిన్న సోమవారం రాత్రి తారకరత్న కండిషన్ క్రిటికల్ గానే ఉంది, వెంటిలేటర్ పై ఆయనకి చికిత్స అందిస్తున్నాము, ఏక్మొ సపోర్ట్ పెట్టలేదు అని నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించడంతో అభిమానులు ఇంకా ఆందోళన చెందారు.
ఈ విషయంలో నందమూరి ఫ్యామిలీ సైలెంట్ గా ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరు తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఆయన సోషల్ మీడియా వేదికగా తారకరత్న కోలుకుంటున్నారంటూ హెల్త్ అప్ డేట్ ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది. అయితే నిన్న సోమవారం తారకరత్నకు నిర్వహించిన అతి ముఖ్యమైన టెస్ట్ ల్లో ఆయన బ్రెయిన్ కి జరిగిన టెస్ట్ కీలకంగా మారింది. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు వైద్యులు. అందులో తారకరత్న ఆరోగ్యం క్రమంగా మెరుగవుతున్నట్లు వెల్లడించారు. తారకరత్నకు చేసిన సిటీ స్కాన్ రిపోర్టులో వైద్యులు పలు కీలక విషయాలు గుర్తించినట్లు తెలుస్తుంది.
తారకరత్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చిన సమయంలో తక్కువ ఆక్సిజన్ అందడంతో బ్రెయిన్ కు ఎఫెక్ట్ అయినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో బ్రెయిన్ డ్యామేజ్ రికవరీపై న్యూరాలజి నిపుణులు పోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే తారకరత్న ఆసుపత్రిలో చేరినప్పటినుండి ఆయనకు సంబందించిన ఫొటోస్ ఏమి బయటికి రాలేదు. కానీ ఇప్పుడు హాస్పిటల్ లోని ఐసీయూలో తారకరత్న చికిత్స పొందుతున్న ఫొటో ఒకటి బయటకు లీక్ అయింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
అలా తారకరత్న అచేతనంగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న పిక్ చూసిన అభిమానులు.. గుండెలు పగిలిపోయేలా బాధపడుతూ.. అన్నా త్వరగా కోలుకో.. నువ్వలా అచేతన స్థితిలో ఉంటే మేము చూడలేము, త్వరగా కోలుకుని రా అంటూ సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు.