ఏజెంట్ మూవీ మొదలై ఎన్ని రోజులైందో.. ఇంకెప్పుడు సినిమా రిలీజ్ చేస్తారంటూ అక్కినేని ఫాన్స్ సోషల్ మీడియాలో #Agent హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ రోజున ఏజెంట్ సమ్మర్ రిలీజ్ అన్నారు. జనవరి 26 రిపబ్లిక్ డే రోజున ఏజెంట్ రిలీజ్ డేట్ పై మేకర్స్ ప్రకటన ఇవ్వబోతున్నారు అని ప్రచారం జరిగింది. కానీ అఖిల్ ఏజెంట్ విషయమై ఎలాంటి అప్ డేట్ లేదు, శర్వానంద్ ఎంగేజ్మెంట్ కి కూడా అఖిల్ ఏజెంట్ లుక్ లోనే వచ్చాడు. లాంగ్ హెయిర్, సిక్స్ ప్యాక్ బాడీని మెయింటింగ్ చేస్తూ ఉన్నాడు. అయితే జనవరి 26 నుండి స్టిల్ ఇప్పటివరకు అఖిల్ అభిమానులు ఏజెంట్ అప్ డేట్ కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
ఈ విషయంలో అక్కినేని అభిమానులు బాగా హార్ట్ అయ్యి ఉన్నారు. ఈలోపు అనిల్ సుంకర ఓ క్యాప్ పెట్టి ఏజెంట్ లోడింగ్ అన్నాడు. ఏజెంట్ డేట్ వచ్చేస్తుందేమో అని అక్కినేని ఫాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ మేకర్స్ క్లారిటీ ఇవ్వడం లేదు. ఏప్రిల్ 14 అఖిల్ ఏజెంట్ రిలీజ్ అంటూ ఫాన్స్ హడావిడి, వెబ్ సైట్స్ లో న్యూస్ లు, సోషల్ మీడియా హంగామా, కానీ అదేదో అధికారికంగా ప్రకటిస్తే బావుంటుంది. కానీ లేదు, అందుకే ఫాన్స్ గోల చేసేది. ఇప్పుడు ఏజెంట్ విషయంలో జరుగుతుంది.
మరి ఏజెంట్ మేకర్స్ ఆ డేట్ ఏదో ప్రకటిస్తే పోలా.. అప్పుడు కానీ అక్కినేని అభిమానులు కూల్ అయ్యేలా కనిపించడం లేదు.