NTR30 అప్ డేట్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో ఓ మినీ యుద్ధమే చేస్తున్నారు. కొరటాల శివ ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ ని సెట్స్ మీదకి తీసుకువెళతాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ NTR30 పై ఎలాంటి అప్ డేట్ రాకపోయేసరికి తిక్కరేగింది. NTR30 ని నిర్మించే యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాతలని సోషల్ మీడియా వేదికగా తిట్టిపోస్తూ #WeWantNTR30update అంటూ హాష్ టాగ్స్ ట్రెండ్ చేస్తూ హంగామా చేస్తున్నారు. ఇదంతా చూసిన ఓ ఎన్టీఆర్ వీరాభిమాని.. ఎన్టీఆర్ ఫాన్స్ ని కూల్ చేసేందుకు ఇలా ట్వీట్ చేసాడు.
#NTR30 updates
ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఓ చిన్న షెడ్యూలు ప్రారంభించే అవకాశం.
అది కాక పోతే మార్చి నుంచి పెద్ద షెడ్యూలు ప్రారంభం
శంషాబాద్ దగ్గర ఓ చోట సెట్ వర్క్ జరుగుతోంది.
హైదరాబాద్ షెడ్యూలు ముగిసాక గోవాలో మరో షెడ్యూలు.
ఆ తరువాత మళ్లీ హైదరాబాద్.@tarak9999 అంటూ ట్వీట్ పెట్టగానే ఎన్టీఆర్ ఫాన్స్ పడి పడి దానిని షేర్ చేస్తూ లైక్స్ కొడుతూ ట్రెండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికే NTR30 కోసం
ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ఆధ్వర్యంలో ఓ సముద్రం సెట్ వేస్తున్నారు, ఆ సెట్ లోనే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కొరటాల ఎన్టీఆర్ తో మొదటి షెడ్యూల్ లో ప్లాన్ చేసాడని ప్రచారం జరుగుతుంది. మరి ఆ అభిమాని పోస్ట్ కి ఈ మేటర్ ఎక్కడో సింక్ అవుతుంది. అంటే నిజంగానే ఆ అభిమాని చెప్పినట్టు ఫిబ్రవరి లాస్ట్ లో షూటింగ్ మొదలవుతుందేమో.. ఇప్పుడు హ్యాపీ నా ఎన్టీఆర్ ఫాన్స్..