పవన్ కళ్యాణ్ సినిమాల్లో కనిపిస్తే ఫాన్స్ అస్సలు ఆగరు. ఆయన ఎలాంటి స్టయిల్ చూపిస్తారు, ఆయన వేసుకునే చెప్పులు, ఆయన వేసుకునే బ్రాండెడ్ డ్రెస్సులు ఇలా ప్రతి విషయంలో పవన్ ఫాన్స్ ఎగ్జైట్ అవుతారు. అసలు ఎలాంటి స్టయిల్ లేకుండా పవన్ పబ్లిక్ లోకి వచ్చినాసరే ఆయన స్టయిల్ గురించే చర్చిస్తారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాకముందు చాలా ఫిట్ గా ఉండేవారు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక పవన్ కళ్యాణ్ ఫిట్ నెస్ వదిలేసారు. జిమ్ చెయ్యడం లేదు. కాస్త బొద్దుగా మారారు కూడా. అయితే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలకి ఆయన బరువు, ఆయన లుక్ అన్ని బాగానే సరిపోయాయి.
కానీ ఆయన తదుపరి సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ లుక్ మార్చాల్సిందే. నిన్నటికి నిన్న సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్న OG మొదలైంది. ఆ ఓపెనింగ్ కి పవన్ కళ్యాణ్ బ్లాక్ డ్రెస్ లో వచ్చారు. అది చూసిన పవన్ ఫాన్స్ పవన్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ లుక్ అంటూ విపరీతంగా ఆ పిక్స్ ని షేర్ చేసి, లైక్స్ కొడుతూ ట్రెండ్ చేస్తున్నారు. కానీ పవన్ లుక్ లో అసలు స్పెషల్ ఏముంది అంటున్నారు ఆయన యాంటీ ఫాన్స్. ఎప్పటిలాగే హాంగర్ కి ఉన్న షర్ట్ వేసుకుని వచ్చేసారు కానీ.. ఆయన లుక్ లో మరే కొత్తదనం లేదు అంటున్నారు. అందులోను పవన్ ఫేస్ కూడా కాస్త బరువుగా కనబడుతుంది అనే కామెంట్స్ కూడా వినిపించాయి.
పవన్ నార్మల్ గా ఓపెనింగ్ కి వచ్చారు. దానికి ఇంత హడావిడా.. అసలే పవన్ చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన హెయిర్ స్టయిల్ కూడా గొప్పగా ఏం లేదు, మామూలుగానే ఉంది. దానికే ఇంత హంగామా అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు.