మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడన్న సంతోషం వెల్లువిరుస్తుంది. ఉపాసన ప్రెగ్నెంట్ అవడంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగితేలుతోంది. అంత సంతోషంగా ఉన్న ఆ ఇంట్లో మరో శుభకార్యానికి నాగబాబు శ్రీకారం చుట్టబోతున్నారు. రెండేళ్ల క్రితం కూతురు నిహారికకు చైతన్యతో అంగరంగా వైభవంగా వివాహం చేసిన నాగబాబు ఇప్పుడు వరుణ్ తేజ్ పెళ్లి కూడా చెయ్యబోతున్నారు. అదే విషయాన్ని నాగబాబు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం మెగా ఫాన్స్ కి ఆనందాన్ని ఇచ్చింది. ఎప్పటినుండో వరుణ్ తేజ్ ఓ హీరోయిన్ ని ప్రేమిస్తున్నాడు, ఆమెనే అతను వివాహం చేసుకుంటాడనే ప్రచారం గట్టిగానే జరుగుతుంది.
అయితే తాజాగా నాగబాబు త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి జరగబోతుంది, ఆ విషయాన్ని వరుణ్ తేజ్ అధికారికంగా ప్రకటిస్తాడని చెప్పారు కానీ.. అమ్మాయి ఎవరనే ప్రశ్నకు ఆయన ఎలాంటి బదులు ఇవ్వలేదు. వరుణ్ పెళ్లిపై అంతకన్నా ఎక్కువ వివరాలను తాను ఇప్పుడు చెప్పలేనని అన్ని విషయాలను వరుణ్ తేజ్ స్పష్టం చేస్తాడని ఆయన అన్నారు. అంతేకాకుండా పెళ్లి తర్వాత వరుణ్ మీరు ఒకే ఇంట్లో కలిసి ఉంటారా అని అడగగానే నాగబాబు చాలా వెరైటీగా ఆసక్తికరమైన జవాబు చెప్పారు.
వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత తన భార్యతో కలిసి వేరే ఇంట్లో ఉంటాడు. నేను, మా ఆవిడ ఓ ఇంట్లో ఉంటే.. వరుణ్ తేజ్ మాత్రం తన భార్య మరో ఇంట్లో ఉంటారు. మేం వేరే వేరే ఇళ్లలో ఉన్నప్పటికీ మానసికంగా అందరం కలిసే ఉంటాం. చిరంజీవిగారు, నేను, పవన్ కళ్యాణ్ కూడా పెళ్లి తర్వాత వేర్వేరుగా ఉంటున్నాం. అయితే ప్రతి ఫెస్టివల్, ప్రతి ఈవెంట్, ఫంక్షన్స్ సమయంలో కలుసుకుంటూనే ఉంటాం అంటూ నాగబాబు మెగా ఫ్యామిలిలో జరగబోయే శుభకార్యం గురించి రివీల్ చేసారు.