Advertisementt

ఆపదొస్తే అందరూ ఒక్కటవుతున్నారే..

Tue 31st Jan 2023 01:43 PM
taraka ratna,nandamuri family  ఆపదొస్తే అందరూ ఒక్కటవుతున్నారే..
Nandamoori family at Bangalore Narayana Hrudayalaya hospital ఆపదొస్తే అందరూ ఒక్కటవుతున్నారే..
Advertisement
Ads by CJ

నందమూరి ఫ్యామిలిలో విభేదాలు ఎప్పటికప్పుడు హైలెట్ అవుతూనే ఉంటాయి. అటు చంద్రబాబు నాయుడిని వ్యతిరేఖించే పురందేశ్వరి ఫ్యామిలీ, ఇటు వియ్యంకుడి కోసం అన్న కొడుకులని దూరం పెట్టే బాలకృష్ణ, తన సెకండ్ వైఫ్ కోసం ఫ్యామిలీతో ఫైట్ చేసే హరికృష్ణ, ఫ్యామిలీ కోసం తమ్ముడిని దూరం పెట్టే కళ్యాణ్ రామ్, ఎప్పుడూ నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్.. ఇవన్నీ ఎప్పటికప్పుడు మీడియాలో చూసేవి, నందమూరి ఫ్యామిలిలో జరిగేవే.. 

కానీ నందమూరి ఫ్యామిలీకి ఆపదొస్తే ఫ్యామిలీ మొత్తం ఒక్కటవుతారని చాలాసార్లు చూపించారు, చూపిస్తున్నారు. గతంలో హరికృష్ణ మరణంతో బాలకృష్ణ అన్న కుమారులకు తోడుగా నిలబడగా.. చంద్రబాబు ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ లకి అండగా నిలిచారు.  నారా చంద్రబాబు నాయుడు వైఫ్, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వైసిపీ మంత్రులు నోటికొచ్చినట్టుగా మాట్లాడితే.. ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రెస్ మీట్ పెట్టి దానిని ఖండించారు. ఇప్పుడు నందమూరి తారకరత్న హార్ట్ ఎటాక్ తో ఆసుపత్రి పాలై ప్రాణాపాయ స్థితిలో ఉండగా.. నందమూరి బాలకృష్ణ తన అన్న కొడుకు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. డాక్టర్స్ తారకరత్నని బ్రతికించడానికి కృషి చేస్తుంటే.. ఫ్యామిలీ మొత్తాన్ని బాలయ్య ఓదారుస్తున్నారు. అలాగే తారకరత్నని బెంగుళూరుకి తరలించిన తర్వాత నందమూరి ఫ్యామిలీ మొత్తం బెంగుళూరికి వెళ్ళింది. పురందరేశ్వరి దగ్గరనుండి రామకృష్ణ, చైతన్య కృష్ణ, మోహన్ కృష్ణ ఇలా అందరూ తారకరత్నని పరామర్శించి వచ్చారు.

ఫ్యామిలీకి కొద్దిగా దూరంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన భార్య అలాగే అన్న కళ్యాణ్ రామ్, ఆయన భార్య స్వాతితో కలిసి తారకరత్నని చూసేందుకు బెంగుళూరుకి వెళ్లారు. నందమూరి తారకరత్న కోసం నందమూరి ఫ్యామిలీ మొత్తం ఒకే తాటిపై నడుస్తుంది. ఇది చూసిన నందమూరి అభిమానులు ఫ్యామిలిలో ఎన్నిగొడవలైనా ఉండొచ్చు, ఏ ఫ్యామిలిలో ఉండవు గొడవలు, కానీ కష్టం వస్తే అందరూ ఒక్కటవుతున్నారే.. నిజంగా నందమూరి ఫ్యామిలీ గ్రేట్ అంటున్నారు.

Nandamoori family at Bangalore Narayana Hrudayalaya hospital:

Taraka Ratna getting treatment at Bangalore hospital 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ