Advertisementt

ఇలియానా హెల్త్ పై ఆమె తల్లి స్పందన

Tue 31st Jan 2023 11:45 AM
ileana,hospital  ఇలియానా హెల్త్ పై ఆమె తల్లి స్పందన
Ileana Mother Clarity on Ileana health ఇలియానా హెల్త్ పై ఆమె తల్లి స్పందన
Advertisement
Ads by CJ

గోవా బ్యూటీ ఇలియానా కొద్దిరోజులుగా వార్తల్లో లేకుండా పోయింది. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతో జోడి కట్టి తన నడుము మడతలతో కుర్రకారుని పిచ్చెక్కించిన ఇలియానా బాలీవుడ్ మీద మోజుపడింది. కానీ ఇలియానాని బాలీవుడ్ లైట్ తీసుకోవడంతో ఓ ఫోటో గ్రాఫర్ తో ప్రేమలో మునిగితేలింది. రెండేళ్లపాటు ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్ తో డేటింగ్ చేసిన ఇలియానా అతనితో బ్రేకప్ తర్వాత బరువు పెరిగింది.

అందమైన నడుము అరంగుళం పెరిగితేనే ఒప్పుకొని యూత్ ఇలియానా బరువుని ఎగతాళి చేసారు. దానితో ఆమె తాను బరువు ఎందుకు పెరగాల్సి వచ్చిందో చెప్పింది. తాను కొద్దిరోజులుగా డిప్రెషన్ కి లోనవడంతో బరువు పెరిగినట్టుగా చెప్పింది. అయితే చాలారోజులుగా సైలెంట్ గా కనబడుతున్న ఇలియానా ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. కారణం ఇలియానా ఆసుపత్రిలో జాయిన్ అవడమే. ఇలియానా ఉన్నట్టుండి తాను హాస్పిటల్ పాలయ్యాయని, ఫుడ్ కూడా తీసుకోలేని పరిస్థితుల్లో తనకి డాక్టర్స్ సెలైన్ పెట్టారని, ఒక్కరోజు హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ తర్వాత డిస్చార్జ్ అయినట్లుగా షేర్ చేసింది.

అయితే ఇలియానా ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది, ఆమెకి ఫుడ్ పాయిజన్ అవడం వలన డి హైడ్రేషన్ అయ్యింది, దానితో ఆమెకి డాక్టర్స్ సెలైన్ పెట్టారు. ఇప్పుడు ఇలియానా కోలుకుంటుంది అంటూ ఇలియానా తల్లి ఆమె హెల్త్ పై అప్ డేట్ ఇచ్చారు.

Ileana Mother Clarity on Ileana health:

Ileana Shares Health Update After Going To Hospital

Tags:   ILEANA, HOSPITAL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ