Advertisementt

ఫస్ట్ టైమ్ కూతురి ఫోటో షేర్ చేసిన ప్రియాంక

Tue 31st Jan 2023 11:14 AM
priyanka chopra,nick jonas  ఫస్ట్ టైమ్ కూతురి ఫోటో షేర్ చేసిన ప్రియాంక
Priyanka Chopra reveals daughter Malti Marie’s face for the first time ఫస్ట్ టైమ్ కూతురి ఫోటో షేర్ చేసిన ప్రియాంక
Advertisement
Ads by CJ

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తనకన్నా పదేళ్ల చిన్నవాడైన నిక్ జోనస్ తో ఏడడుగులు నడిచి అందరి నోళ్ళలో నానింది. అటు పెళ్లి విషయమే కాదు, ఇటు ఆమె సరోగసి ద్వారా బిడ్డని కన్నప్పుడూ అంతే విమర్శల పాలైంది. ప్రియాంక చోప్రా తన అందం తగ్గిపోతుంది అని సరోగసి ద్వారా ఆమె బిడ్డని కన్నది అంటూ చాలారకాలుగా ప్రియాంక చోప్రాని ట్రోల్ చేసారు. అయితే తన బిడ్డ తన చేతుల్లోకి వచ్చినప్పటినుండి స్టిల్ ఇప్పటివరకు తన కూతురిని ఈ ప్రపంచానికి పరిచయం చెప్పలేదు ప్రియాంక-నిక్ జంట. తన బేబీ తన చేతుల్లోకి ఎలా వచ్చిందో, తానెందుకు సరోగసి ద్వారా బిడ్డని కనాల్సి వచ్చిందో ఈమధ్యనే రివీల్ చేసింది ప్రియాంక.

తనకున్న హెల్త్ ప్రోబ్లెంస్ వలనే తాను సరొగసీని సంప్రదించాల్సి వచ్చింది, తన బిడ్డ పుట్టినప్పుడు చాలా చిన్న పాపగా ఉంది, తాను బ్రతుకుంటుందో లేదో అని భయపడ్డామంటూ తన కూతురు మాల్దీ పుట్టుకని రివీల్ చేసింది. పాప అనారోగ్యంతో పాటు ప్రైవసీ కోసం పాపను మీడియా కెమెరాలకు చిక్కనివ్వలేదు. తాజాగా తన కూతురు మొదటి పుట్టిన రోజు ని గ్రాండ్ గ నిర్వహించిన ప్రియాంక తన కూతురును రీసెంట్ గా ప్రపంచానికి పరిచయం చేసింది. వైట్ డ్రెస్ లో మాల్టీ మేరీ నిజంగా ఏంజిల్ లా కనబడుతుంది.

అమెరికాలో ప్రతిష్ఠాత్మకమైన హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ అవార్డుల వేడుకకి హాజరైన ప్రియాంక-నిక్ జోనల్ లు తమ కూతురుని ప్రపంచానికి పరిచయం చేసారు. కూతురును ఎత్తుకుని, ఆడిస్తూ కెమెరాలకు పోజిచ్చింది ప్రియాంక. మాల్టీ మేరీ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే క్షణాల్లో వైరల్ గా మారాయి.

Priyanka Chopra reveals daughter Malti Marie’s face for the first time:

Priyanka Chopra and Nick Jonas reveal their daughter face for the first time

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ