కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పెళ్లి వార్తలు విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. కీర్తి సురేష్ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోబోతుంది, కాదు ఆమె చిన్ననాటి స్నేహితుడు, క్లాస్ మేట్, రిసార్ట్ ఓనర్ తో ఏడడుగులు నడవబోతుంది, 13 ఏళ్ళ స్నేహం ప్రేమగా మారింది, అది కాదు కోలీవుడ్ సీనియర్ హీరో తో కీర్తి సురేష్ ప్రేమలో ఉంది, త్వరలోనే పెళ్లి కూడా ఇలా రోజుకో కథనం సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది.
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో పెళ్లి అన్నప్పుడు కీర్తి సురేష్ పేరెంట్స్ వెంటనే ఆ వార్తలని ఖండించినా.. ఇప్పుడు కీర్తి సురేష్ పెళ్లి విషయంలో జరుగుతున్న వార్తలను ఆమె కానీ, పేరెంట్స్ కానీ ఖండించకపోవడంతో.. ఈ వార్తలు నిజమే అని నమ్మే పరిస్థితిలో ఆమె అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా కీర్తి సురేష్ తన పెళ్లిపై వస్తున్న వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టడమే కాదు, తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు, ముందు సినిమాలు తర్వాత పెళ్లి అంటూ తన పెళ్లిపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది.
తాను తన క్లాస్ మేట్ ని వివాహం చేసుకోబోతున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు, ప్రేమ, పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు.. సో ఇవన్నీ నమ్మకండి.. నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు అంటూ మహానటి కీర్తి సురేష్ ఇచ్చిన క్లారిటీతో ఆమె అభిమానులు ఫుల్ జోష్ లోకి వెళుతున్నారు. కీర్తి సురేష్ నానితో నటించిన సదసరా టీజర్ రీసెంట్ గానే రిలీజ్ కాగా సినిమా మార్చ్ లో విడుదల కాబోతుంది. ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంది. చిరంజీవి భోళా శంకర్ షూటింగ్ లో కీర్తి బిజీగా ఉంది.