NTR30 ఎప్పుడు మొదలవుతుంది, కనీసం అప్ డేట్ అయినా ఇవ్వండి బ్రో అనే స్టేజ్ నుండి అసలు NTR30 మొదలు పెట్టే ఆలోచన ఏమైనా ఉందా.. ఏదైనా అప్ డేట్ ఇచ్చి చావండి అనే స్టేజ్ కి వెళ్లారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్. ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు షూటింగ్ తో సందడి చేస్తాడా.. NTR30 లో ఎన్టీఆర్ తో కలిసి రొమాన్స్ చెయ్యబోయే హీరోయిన్ ఎవరో, కొరటాల శివ ఏ సీన్స్ తో NTR30 మొదలు పెటాడతాడా అనే ఆరాటంలో ఆత్రుత ఎక్కువవుతుంటే.. NTR30 మేకర్స్ మాత్రం NTR30 విషయంలో ఇంకా నిమ్మకి నీరెత్తినట్టే ఉన్నారు. న్యూ ఇయర్ రోజు NTR30 విడుదల డేట్ ఇచ్చి ఫిబ్రవరి నుండి షూటింగ్ మొదలవుతుంది అన్నారు. రేపు ఫిబ్రవరి 1. కానీ ఇంతవరకు NTR30 అప్ డేట్ రాకపోయేసరికి ఎన్టీఆర్ ఫాన్స్ మెంటలెక్కిపోతున్నారు.
సోషల్ మీడియాలో #NTR30 ని ట్రెండ్ చెయ్యడమే కాదు.. #WeWantNTR30Update, Cenimalu Inka chythvooo, Chyavoo Ani Edo okati press meet petti chapuu bro nuvu @tarak9999 , #NTR30 movie start avadu pekaduu Enduku bro manaki movies #boycottyuvasudhaarts Movie apii. @YuvasudhaArts @NTRArtsOfficial, Timeline lo #Nani30 ani Vachina Prathisari #NTR30 ani anukuntunna 🏃🏃. Brooo @tarak9999 @YuvasudhaArts @NTRArtsOfficial అంటూ NTR30 మేకర్స్ యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థలను ఏసుకుంటున్నారు.
మరి NTR30 ఈ డేట్ లో పూజా కార్యక్రమాలు చేసుకుంటుంది, ఈ డేట్ లో రెగ్యులర్ షూట్ కి వెళుతుంది అని ఏమైనా చెబితే ఫాన్స్ శాంతిస్తారు. లేదంటే అప్ డేట్ ఇచ్చేవరకు NTR30 మేకర్స్ కి చమటలు పట్టేలా చేస్తారేమో ఈ ఫాన్స్.