మూడురోజులుగా ప్రాణాలతో పోరాడుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్యంపై ఈరోజు బెంగుళూరు నారాయణ హృదయాలయ డాక్టర్స్ ఇవ్వబోయే హెల్త్ బులిటెన్ కోసం అభిమానులు పదే పదే సోషల్ మీడియాని, టీవీ ఛానల్స్ ని వెతుకుతూ కూర్చున్నారు. మూడు రోజుల క్రితం హార్ట్ స్ట్రోక్ తో ఆసుపత్రి పాలైన నందమూరి తారకరత్న ఇప్పటికి క్రిటికల్ కండిషన్ లోనే ఉన్నాడు. కుటుంబ సభ్యులు తారకరత్న చికిత్సకి స్పందిస్తున్నాడని చెబుతున్నా వైద్యుల నుండి ఎలాంటి ప్రకటన రాకపోయేసరికి అందరిలో ఏదో భయం.
ఈరోజు సోమవారం తారకరత్నకు మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తేనే ఆయన ఆరోగ్యంపై పూర్తి క్లారిటీ వస్తుంది అనేసరికి.. ఆ పరీక్షలు ఎప్పటికి పూర్తవుతాయో అని అందరూ ఎదురు చూసారు. తాజాగా తారకరత్న హెల్త్ బులిటెన్ వైద్యులు విడుదల చేసారు. తారకరత్న ఇంకా క్రిటికల్ పొజిషన్ లోనే ఉన్నాడని, ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది, ప్రస్తుతం వెంటిలేటర్ పైనే చికిత్స కొనసాగుతుంది, ఆయనకి ఏక్మొ సపోర్ట్ ఇవ్వలేదు, తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకి తెలియజేస్తున్నామంటూ నారాయణ హృదయాలయ వైద్యులు తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల చేసారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. తారకరత్నకి అన్నిరకాల వైద్య పరిక్షలు నిర్వహించారు, ప్రస్తుతం న్యూరాలజిస్ట్స్ పర్యవేక్షణలో తారకరత్న ఉన్నట్లుగా చెప్పారు. డాక్టర్స్ మాత్రం తారకరత్న పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లుగా ప్రకటించారు.