కొంతకాలం టాలీవుడ్ ని ఓ ఊపు ఊపి బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కి అక్కడ సెటిల్ అయ్యేక్రమంలో సౌత్ ని లైట్ తీసుకున్న గోవా బ్యూటీ ఇలియానా ఈమధ్యన సినిమాలకి షూటింగ్స్ కి బాగా దూరంగా ఉంటుంది. అలాగని జిమ్ ల్లోనూ, అవార్డు వేడుకల్లోనూ, పార్టీ ఈవెంట్స్ లోనూ కనిపించడం లేదు. సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఆ మధ్యన బాయ్ ఫ్రెండ్ మోసం చేసాడని డిప్రెషన్ లోకి వెళ్లి బాగా వెయిట్ పెరిగిన ఇలియానా ఉన్నట్టుండి అభిమానులకి షాకిచ్చింది. అది ఇలియానా హాస్పిటల్ పాలైనట్టుగా ఓ పోస్ట్ పెట్టింది.
తాను ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నట్లుగా, ఆహారం తీసుకోలేని పొజిషన్ లో ఉండడంతో వైద్యులు తనకి సెలైన్స్ పెట్టినట్లుగా ఫొటోస్ ని షేర్ చేసింది. ఇలియానా కి ఏమైంది, ఎందుకిలా అయ్యింది, అసలు ఆమె అనారోగ్యానికి కారణాలేమిటో అనేది చెప్పలేదు కానీ .. డాక్టర్స్ ఇచ్చిన ట్రీట్మెంట్ తో తాను ప్రస్తుతం కోలుకున్నానని ఇలియానా మరో పోస్ట్ లో పేర్కొంది. అయితే ఇదంతా ఒక్కరోజులో జరిగిపోయిందని ఇలియానా ట్విస్ట్ కూడా ఇచ్చింది.
ఇలియానా కోలుకుని బావుండడం అభిమానులకి సంతృప్తినిచ్చినా.. అసలు ఇలియానా కి ఏమైందో అనే ఆందోళనలో వాళ్ళు ఉన్నారు.