Advertisementt

ప్రభాస్ కాస్ట్లీ కారుని డ్రైవ్ చేసిన మారుతి

Mon 30th Jan 2023 03:59 PM
maruthi,prabhas  ప్రభాస్ కాస్ట్లీ కారుని డ్రైవ్ చేసిన మారుతి
Director Maruthi Rides Prabhas Lamborghini ప్రభాస్ కాస్ట్లీ కారుని డ్రైవ్ చేసిన మారుతి
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే ఆయన రేంజ్ ఎలా ఉంటుందో.. ఆయన స్టేటస్, లైఫ్ స్టయిల్ ఎలా ఉంటుందో.. ఆయన తిరిగే కార్లు ఎలా ఉంటాయో, ఆయన ఉంటున్న ఇల్లు ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ ప్రతి అభిమాని, ప్రతి ప్రేక్షకుడిలో ఉంటుంది. ప్రభాస్ వేసుకునే చెప్పుల దగ్గర నుండి ఆయన వేసుకునే షర్ట్, వాచ్ వరకు అన్నీ ఏ బ్రాండ్ కి చెందినవో అనే ఆసక్తి ఉంటుంది. అయితే తాజాగా ప్రభాస్ కాస్ట్లీ కారు లాంబోర్గినీ ని ప్రభాస్ డైరెక్టర్ మారుతి డ్రైవ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రభాస్ మారుతీ తో రాజా డీలక్స్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రభాస్ ఫాన్స్ ట్రోల్ చేస్తున్నందున మారుతీ ప్రభాస్ తో చేస్తున్న చిత్ర షూటింగ్ ని సైలెంట్ గా కానిచ్చేస్తున్నాడు. అయితే ప్రభాస్ కొద్దిరోజులుగా ప్రాజెక్ట్ కే షూటింగ్ లో పాల్గొంటున్నారు. దాని కోసం ఆయన లాంబోర్గినీ కారులోనే వెళుతున్నారు. ఇప్పుడు మారుతీ రాజా డీలక్స్ సినిమా షూటింగ్ కి కూడా ప్రభాస్ ఈ లాంబోర్గినీలోనే వెళ్లడంతో.. మారుతీ ఆ కారుని తీసుకుని డ్రైవ్ చేసి ముచ్చట తీర్చుకున్నట్టుగా తెలుస్తుంది. 

ప్రభాస్-మారుతీ కాంబోలో తెరకెక్కుతున్న రాజా డీలక్స్‌ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని ఓ థియేటర్ సెట్ లో జరుగుతోంది. ఆ షూటింగ్ కి హాజరయ్యేందుకు ప్రభాస్ లాంబోర్గినీలోనే వెళ్తున్నారు. ఆ కాస్ట్లీ లాంబోర్గినీ కారుని డైరెక్టర్ మారుతి నడుపుతూ కనిపించడంతో ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో అది వైరల్ అయ్యింది.

Director Maruthi Rides Prabhas Lamborghini:

Maruthi Takes Prabhas Expensive Car For A Ride

Tags:   MARUTHI, PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ