Advertisementt

తారకరత్న హెల్త్ అప్ డేట్ కోసం వెయిటింగ్

Mon 30th Jan 2023 02:03 PM
taraka ratna health update  తారకరత్న హెల్త్ అప్ డేట్ కోసం వెయిటింగ్
Waiting for Taraka Ratna Health Update తారకరత్న హెల్త్ అప్ డేట్ కోసం వెయిటింగ్
Advertisement
Ads by CJ

నందమూరి తారకరత్న బెంగుళూరు నారాయణ హృదయాలయలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. నారాయణ హృదయాలయ వైద్యులు, అలాగే బయటనుండి వచ్చిన ప్రత్యేక డాక్టర్స్ బృందం నిర్విరామంగా తారకరత్నని కాపాడేందుకు కృషి చేస్తున్నారు. తారక రత్న ఇప్పటివరకు క్రిటికల్ కండిషన్ నుండి బయటకు రాలేదు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే తారకరత్న శరీరం చికిత్సకి స్పందిస్తుంది అని చెబుతున్నారు తప్ప వైద్యులు ఇంతవరకు ఈ విషయాన్ని ప్రకటించలేదు. తారకరత్న ఇప్పటికీ వెంటిలేటర్ పైనే ఉన్నాడు. 

ఈరోజు సోమవారం నారాయణ హృదయాలయంలో చేసే పరీక్షలు కీలకం అని, ఆయన బ్రెయిన్ ఎంతవరకు డ్యామేజ్ అయ్యిందో చెబుతారని, అలాగే మళ్ళీ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎంతవరకు ఉంది, ఏ ఏ ఆర్గాన్స్ పనితీరు బావుంది అనేది ఈరోజు చెయ్యబోయే పరీక్షల్లో తేలిపోతుంది అని వైద్యులు ప్రకటించడంతో తారకరత్న హెల్త్ బులిటెన్ కోసం ఆయన అభిమానులు, నందమూరి ఫాన్స్, అలాగే నందమూరి కుటుంబ సభ్యులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

తారకరత్న హెల్త్ రిపోర్ట్స్ కోసం వెయిటింగ్ అంటున్నారు. కోట్లాదిమంది ప్రజలు, అభిమానులు, కుటుంబ సభ్యుల ప్రార్థనలతో తారకరత్న కోలుకోవాలని అందరూ ఆ దేవుడిని వేడుకుంటున్నారు. 

Waiting for Taraka Ratna Health Update:

Taraka Ratna Health Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ