Advertisementt

సోదరుడి పెళ్ళిలో పూజ హెగ్డే

Mon 30th Jan 2023 10:28 AM
pooja hegde,rishabh wedding  సోదరుడి పెళ్ళిలో పూజ హెగ్డే
Pooja Hegde Brother Rishabh Hegde Wedding pics viral సోదరుడి పెళ్ళిలో పూజ హెగ్డే
Advertisement
Ads by CJ

గత ఏడాది పూజ హెగ్డే కి బాడ్ ఇయర్ అని చెప్పాలి. ఆమె నటించిన భారీ బడ్జెట్ మూవీస్ అన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. బుట్ట బొమ్మగా క్రేజీ గా స్టార్ హీరోలతో బిగ్ ప్రాజెక్ట్స్ లో భాగమైన పూజ హెగ్డే గ్లామర్ పరంగా హైలెట్ అయినా.. సినిమాల రిజల్ట్ ఆమెని ఇబ్బంది పెట్టాయి. టాలీవుడ్ నుండి కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ఏ ఒక్క భాషా ఆమెని సంతోష పెట్టలేదు. ఇక ఈ ఏడాది పూజ హెగ్డే మహేష్ తో చెయ్యబోయే SSMB28 కోసం ఎదురు చూస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరుగుతుంది.

అయితే పూజ హెగ్డే కూడా ఈ షెడ్యూల్ లోనే SSMB28 షూటింగ్ చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. కానీ ఆమె తన సోదరుడి వివాహ వేడుకల కోసం కొద్దిగా సమయం తీసుకుని SSMB28 లోకి ఎంటర్ అవ్వబోతుంది. తాజాగా పూజ హెగ్డే ఇంట శుభకార్యం జరిగింది. తాజాగా పూజ సోదరుడు రిషభ్ హెగ్డే వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రిషభ్ హెగ్డే వివాహం శివానీ శెట్టి తో జరిగింది. ఈ వేడుకకు పూజ హెగ్డే ఫ్యామిలీ మెంబెర్స్, శివాని కుటుంబానికి చెందిన వారు భారీ సంఖ్యలో హజరయ్యారు. తన సోదరుడు పెళ్లి వేడుకకు సంబంధించిన ప్రతి విషయాన్ని పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

తన సోదరుడి రిషబ్ హెగ్డే పెళ్లి ఫొటోస్ ని షేర్ చేస్తూ.. తన సోదరుడి పెళ్లి వేడుక మొదలైన రోజు నుంచి తానూ ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నానని.. చిన్న పిల్లలా ప్రతి వేడుకని ఎంజాయ్ చేశాను, నవ్వేశానని, ఆనందభాష్పాలు రాల్చానంటూ పూజ హెగ్డే రాసుకొచ్చింది. ప్రస్తుతం పూజ హెగ్డే తన సోదరుడి వివాహంలో ఎంతగా ఎంజాయ్ చేసిందో అనేది ఫొటోస్ రూపంలో మీ కోసం..

Pooja Hegde Brother Rishabh Hegde Wedding pics viral:

Pooja Hegde Shares Pics From Brother Rishabh Wedding

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ