Advertisementt

అందుకే కీర్తి సురేష్ పెళ్లి వాయిదా

Sun 29th Jan 2023 05:10 PM
keerthy suresh  అందుకే కీర్తి సురేష్ పెళ్లి వాయిదా
Is Keerthy Suresh marrying a school friend? అందుకే కీర్తి సురేష్ పెళ్లి వాయిదా
Advertisement
Ads by CJ

కొద్దిరోజులుగా కీర్తి సురేష్ పెళ్లిపై వస్తున్న వార్తలు మరే హీరోయిన్ పెళ్లిపై వచ్చి ఉండవేమో.. అదిగో కీర్తి సురేష్ పెళ్లి, ఇదిగో కీర్తి సురేష్ వివాహం చేసుకోబోయే వ్యక్తి అంటూ మీడియాలో రకరకాల కథలు వస్తున్నా కీర్తి సురేష్ మాత్రం ఈ పెళ్లి విషయంపై పెదవి విప్పడం లేదు. తాజాగా కీర్తి సురేష్, కోలీవుడ్ హీరో విజయ్ ప్రేమలో ఉన్నారు, విజయ్ తన వైఫ్ కి విడాకులు ఇచ్చి కీర్తిని రెండో వివాహం చేసుకోబోతున్నాడు అంటూ బిగ్గెస్ట్ రూమర్ చక్కర్లు కొట్టినా కీర్తి సురేష్ గమ్మునే ఉంది.

అయితే కీర్తి సురేష్ పెళ్లి దాదాపు ఖాయమైనట్టే, కానీ కెరీర్ లో బిజీగా ఉండడం వలనే ఆమె పెళ్లిని వాయిదా వేసుకుంది అంటూ కీర్తి సురేష్ క్లోజ్ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న న్యూస్. కీర్తి సురేష్ 13 ఏళ్లుగా తన క్లాస్ మేట్ తో ప్రేమలో ఉంది. అతను కేరళకి చెందిన ఓ రిజార్ట్ ఓనర్, కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయేది ఆమె క్లాస్ మేట్ నే, వీరి పెళ్ళికి ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయి కూడా, కానీ కీర్తి సురేష్ చేతిలో ఉన్న సినిమాల వలన పెళ్లి పోస్ట్ చేసుకుంది అంటున్నారు. 

ప్రస్తుతం కీర్తి సురేష్ నటించిన దసరా విడుదలకు సిద్ధమవుతుండగా.. భోళా శంకర్ షూటింగ్ జరుగుతుంది. అలాగే తమిళ సినిమాలతోను కీర్తి సురేష్ బిజీగా ఉంటుంది. కీర్తి సురేష్ పెళ్లి, ఆమె చేసుకోబోయే వరుడిపై కొద్దిరోజుల్లో స్పష్టతవచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. 

Is Keerthy Suresh marrying a school friend?:

Rumours of Keerthy Suresh wedding goes viral on social media

Tags:   KEERTHY SURESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ