తారకరత్నకు రెండురోజుల క్రితం హార్ట్ ఎటాక్ రావడంతో ఆయనని కుప్పం ఆసుపత్రి నుండి మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి మార్చారు. తారకరత్నని బెంగుళూర్ కి షిఫ్ట్ చెయ్యగానే నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా బెంగుళూరుకి చేరుకుంటున్నారు.
ఈరోజు ఆదివారం ఉదయం జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ బెంగళూరు నారాయణ హృదయాలయకు చేరుకున్నారు. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌తోపాటు వాళ్ళభార్యలు స్వాతి, లక్ష్మి ప్రణతి, నారా బ్రాహ్మణి కూడా ఆస్పత్రికి వచ్చారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వస్తున్న విషయం తెలియడంతో.. కర్నాటక హెల్త్ మినిస్టర్ సుధాకర్‌ను పంపారు సీఎం బొమ్మై. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లని ఎయిర్ పోర్ట్ లోనే రిసీవ్ చేసుకుని నారాయణ హృదయాలకు తీసుకుని వచ్చారు. తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని డాక్టర్లు వారికి తెలిపారు. అవసరమైతే విదేశాల నుంచి ఎక్స్‌పర్ట్స్‌ను పిలిపించాలని వారు కోరినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ నారాయణ హృదయాల వైద్యులతో మాట్లాడారు.
అయితే బాలకృష్ణ మీడియా సమావేశంలో తారకరత్న కోలుకుంటున్నారని చెప్పలేము, అలాగని క్రిటికల్ కండిషన్ అనలేము, ఆయన వైద్యానికి స్పందిస్తున్నాడు, మళ్ళీ హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉన్న కారణంగా స్టెంట్ వెయ్యలేదు అని చెప్పారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, కర్ణాటక హెల్త్ మినిస్టర్ మీడియా తో మట్లాడారు. తారకరత్న త్వరగా కోలుకోవాలంటే మీ ఆశీర్వచనాలు కావాలి, ఆయన చికిత్స కి స్పందిస్తున్నారు, ప్రస్తుతం ఆయన కండిషన్ స్టేబుల్ గానే ఉంది. తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతుంది, తారకరత్నకు అభిమానుల ఆశీర్వచనం ఉంది అని ఎన్టీఆర్ మాట్లాడగా.. కళ్యాణ్ రామ్ తారకరత్న త్వరగా కోలుకోవాలని ప్రార్దిస్తున్నట్టుగా తెలిపారు.