షారుఖ్ ఖాన్ లేటెస్ట్ చిత్రం పఠాన్ కలెక్షన్స్ పరంగా బాలీవుడ్ కి బిగ్ బూస్ట్ ని అందించింది. యావరేజ్ టాక్ తోనే కోట్లు కొల్లగోసుతూ రోజు రోజుకి కొత్త నెంబర్లు క్రియేట్ చేస్తున్న పఠాన్ నాలుగు రోజులకే నాలుగు వందల కోట్లు కొల్లగొట్టింది అంటూ బాలీవుడ్ క్రిటిక్స్ పోస్టర్స్ వేసి సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. కొంతకాలంగా బాలీవుడ్ లో ఇంత దూకుడుగా ఏ మూవీ కలెక్షన్స్ తేకపోవడంతో పఠాన్ పై ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పఠాన్ కలెక్షన్స్ చూసిన ప్రేక్షకులు ఈ సినిమాపై ఆసక్తినిన్ కనబరుస్తూ థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. పఠాన్ కి లాంగ్ వీకెండ్ బాగా కలిసొచ్చింది. రిపబ్లిక్ డే, ఈ వారాంతం కలిసిరావడంతో కలెక్షన్స్ కుమ్మేస్తున్నాయి.
సోషల్ మీడియాలో పఠాన్ పై నెగిటివిటి కనిపించినా ఆ నెగిటివిటీని దాటుకుని, ఎదురించి పఠాన్ థియేటర్స్ లో దూసుకుపోతుంది. పఠాన్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా పఠాన్ గ్రాస్ వంద కోట్లు దాటించేసింది. తర్వాతిరోజు 100 కోట్లు, మూడో రోజు 100 కోట్లతో మూడు రోజుల్లోనే ఏకంగా 300 కోట్ల గ్రాస్ కొల్లగొట్టేసిందీ పఠాన్. నాలుగోరోజు శనివారం 100 కోట్ల మార్క్ తో నాలుగు రోజుల్లో 400 కోట్లు కొల్లగొట్టిన పఠాన్ ఈ ఆదివారం కూడా టికెట్ బుకింగ్స్ లో దూసుకుపోతుంది. అంటే ఫస్ట్ వీకెండ్, ఐదు రోజులు ముగిసేసరికి పఠాన్ 500 కోట్ల మార్క్ ని అందుకోవడం ఖాయంగా కనబడుతుంది. పఠాన్ ఆ విధంగా పరవళ్లు తొక్కుతూ దూసుకుపోవడంతో బాలీవుడ్ ప్రముఖులు, మీడియా, క్రిటిక్స్ అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.
అయితే పఠాన్ కి గనక ఇంకా హిట్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఉంటే.. కలెక్షన్స్ పరంగా ఇంకాస్త కొత్త నెంబర్లు నోట్ చేసి, రికార్డులు సృష్టించేది. కాని పఠాన్ కి జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా ఈ రకమైన కలెక్షన్స్ రావడంతో షారుఖ్ మళ్లీ క్రేజీగా లైం టైం లోకి వచ్చేసారు. కొంతకాలంగా ఆయన సక్సెస్ లేక సతమతమవుతున్నారు. కానీ ఇప్పుడు పఠాన్ సక్సెస్ ఆయనికి వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.