సూపర్ స్టార్ రజినీకాంత్ ఎప్పుడూ సినిమాల విషయాలే కానీ.. ఆయన వయక్తిగత విషయాలు కానీ, పిల్లలు విషయాలు కానీ, భార్య లత గురించి కానీ ఎక్కడా మాట్లాడారు. రజినీకాంత్ తన సినిమాలేవో తాను చేసుకుంటూ పోతుంటారు. రాజకీయాల్లోకి వద్దామనుకుంటే ఆయన వయసు రీత్యా ఆరోగ్యం సహకరించక ఆయన పాలిటిక్స్ ని పక్కనబెట్టేసి సినిమాలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా రజినీకాంత్ తన జీవితంలో ఉన్న చెడు అలవాట్లని ఎలా వదులుకున్నారు.. దానికి కారణమైన వారు ఎవరో చెప్పారు. తాను సినిమాల్లోకి రాకముందు బస్సు కండక్టర్ గా ఉద్యోగం చేసేవాడిని, అప్పట్లో నాకు సిగరెట్, నాన్ వెజ్, డ్రింక్ చేసే అలవాటు ఉంది. ఆ మూడు మంచి కాంబినేషన్. అందుకే ఎక్కువుగానే తీసుకునేవాడిని.
కానీ అవి ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలుసు. ఆ అలవాట్లు ఉన్నవారు 60 ఏళ్ళకి మించి బ్రతకరు. కొంతకాలం తర్వాత అవి మన అనారోగ్యానికి కారణమవుతాయనిపించింది. నా భార్య లత వల్లే నేను ఆ చెడు అలవాట్లకు దూరమయ్యాను, నా భార్య చూపించిన ప్రేమతో నేను వాటికీ దూరమయ్యాను, లత వల్లే నేను వాటికి దూరంగా క్రమశిక్షణ తో కూడిన జీవితాన్ని గడుపుతున్నాను, ఈ వయసులోనూ ఆరోగ్యంగా ఉంటున్నాను, అందుకే నా భార్య లతకి నేను ఎప్పటికి రుణపడి ఉంటాను అంటూ సూపర్ స్టార్ రజినీకాంత్ మద్యం మానెయ్యడం పట్ల తన భార్య ఎంతగా హెల్ప్ చేసిందో ఓ ఈవెంట్ లో చెప్పడం హైలెట్ అయ్యింది.