Advertisementt

స్మూత్ గా వార్నింగ్ ఇచ్చేసిన రామ్ చరణ్

Sun 29th Jan 2023 09:38 AM
ram charan,chiranjeevi  స్మూత్ గా వార్నింగ్ ఇచ్చేసిన రామ్ చరణ్
Ram Charan Mass Warning స్మూత్ గా వార్నింగ్ ఇచ్చేసిన రామ్ చరణ్
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలీపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు మెగాస్టార్ చిరు దగ్గర నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకు తమదైన శైలిలో రోజాకి కౌంటర్లు వేశారు. డైమండ్ రాణి అంటూ పవన్ కళ్యాణ్ రోజాకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసారు. అయితే తాజాగా వీరయ్య విజయ విహారమంటూ హన్మకొండలో చేసిన ఈవెంట్ కి రామ్ చరణ్ ప్రత్యేక అతిధిగా హాజరయ్యాడు. తాను అమెరికాలో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు వాల్తేర్ వీరయ్యని చూసేద్దామా అని అతృతతో ఉన్నాను, సినిమా చూసాక బాగా నచ్చింది, రవితేజ కేరెక్టర్ ని బాగా ఎంజాయ్ చేశాను అన్న రామ్ చరణ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్, దర్శకుడు బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిని అందరిని పేరు పేరునా పొగిడిన తర్వాత రామ్ చరణ్ కూడా మినిస్టర్ రోజాకి అలాగే చిరు హేటర్స్ కి స్మూత్ గా ఓ వార్నింగ్ పడేసాడు.

చిరంజీవిగారి సినిమాలకి స్పెషల్ గెస్ట్ ఆవరసమే లేదు. ఆయనకి ఆయనే గెస్ట్, నేను కూడా సినిమా చూసి ఎంతగా ఎంజాయ్ చేసానో మీతో పంచుకోవడానికి వచ్చాను. ఇక చిరంజీవి గారిని ఏమైనా అనాలి అంటే కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులే అనగలగాలి. చిరంజీవి మౌనంగా, సౌమ్యంగా ఉంటారని అందరికి తెలుసు. ఆయన సైలెంట్ గా ఉంటేనే ఇలా ఉంది. అదే ఆయన మౌనం వీడితే వేరేలా ఉంటుంది. ఆయన మౌనంగా ఉంటారేమో కానీ.. ఆయన వెనుకున్న మేము(అభిమానులం) కాదు, ఆయనని ఏమైనా అంటే మేము ఊరుకోము అని మౌనంగానే మీకు చెబుతున్నా అంటూ మినిస్టర్ రోజాకి, చిరు పై కామెంట్స్ చేసే వారికి రామ్ చరణ్ ఇండైరెక్ట్ గా వేసిన కౌంటర్ వైరల్ గా మారింది.

Ram Charan Mass Warning:

Ram Charan Mass Warning To Chiru haters

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ