నారా లోకేష్ నిన్న శుక్రవారం కుప్పం నియోజకవర్గం నుండి యువగళం పేరుతొ పాదయాత్ర మొదలు పెట్టాడు. వైసీపీ నాయకులు పప్పు పప్పు అంటూ లోకేష్ ని వెటకారం చేస్తూ ఎన్ని విధాలుగా అడ్డుకున్నా, ఆయన ఎమ్యెల్యేగా గెలవలేదు, ఏ అర్హతతో పాదయాత్ర చేస్తాడని గొంతు చించుకున్నా, అసలు లోకేష్ కి ప్రజాధరణే లేదు అన్న నోళ్లు మూతబడేలా లోకేష్ పాదయాత్ర అడుగడుగునా సక్సెస్ అవుతుంది. ఆయన పాదయాత్ర మొదలు పెట్టకముందే లోకేష్ చుట్టూ టిడిపి శ్రేణులు, కార్యకర్తలు, ఇంకా ప్రజలు మద్దతు కనిపించింది. పాదయాత్ర మొదలు పెట్టినప్పటినుండి ఆయనకి అడుగడుగునా జనాదరణ కనిపించింది. ఆయనతో పాటుగా వేలాదిమంది నడకకలిపారు.
లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహారథం పడుతున్నారు. కేరింతలు కొట్టే ఉత్సాహంతో నారా లోకేష్ పాదయాత్ర ప్రతి అడుగులో విజయవంతం అయ్యింది, అవుతుంది. లోకేష్ కి వస్తున్న జనాదరణ చూసిన వైసీపీ ఛానల్ సాక్షి ఏడవలేక నవ్వుతుంటే.. వైసీపీ కొమ్ము కాసే మీడియా మాత్రం లోకేష్ పాద యాత్ర చూస్తూ కుళ్లిపోతూ ఏడుపు స్టార్ట్ చేసింది. లోకేష్ పాదయత్రని తక్కువ చేస్తూ.. పాదయాత్ర విజయవంతం అవవడం లేదు అంటూ చూపిస్తుంది. వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు లోకేష్ కొస్తున్న ప్రజాదరణకు కక్కలేకమింగుతున్నారు. లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ ఇస్తున్న ప్రసంగాలు చూసి లోకేష్ మనిషి మందం తగ్గినా నాలుక మందం తగ్గలేదు అంటూ వెక్కిరిస్తున్నారు.
లోకేష్ చెయ్యెత్తి పిడికిలి బిగించి చూపించిన పౌరుషం కృత్రిమంగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. లోకేష్ ఈ పాదయత్రకి న్యాయం చెయ్యలేడు, అతనిలో యూత్ లో ఉండాల్సిన లక్షణాలు లేవని టీడీపీ నేతలే భయపడుతున్నారంటూ అరుస్తున్నారు. లోకేష్ లో ఉత్సాహం లేదు, రెండోరోజుకు నీరసించిపోయాడంటూ ఫేక్ న్యూస్ లు ప్రచారం చేస్తున్నారు.
ఎంతమంది ఎంతగా ఏడ్చినా, ఎన్ని కుక్కలు మొరిగినా.. లోకేష్ పాదయాత్రకు రావాల్సిన క్రేజ్, హైప్ భారీగా వచ్చేసింది. ఇక ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉత్సాహం, ఇదే స్పందన రావడం మాత్రం ఖాయమనే చెప్పాలి.