Advertisementt

బెంగుళూరుకి ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్

Sat 28th Jan 2023 08:32 PM
jr ntr,kalyan ram  బెంగుళూరుకి ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్
NTR-Kalyan Ram go to Bangalore tomorrow బెంగుళూరుకి ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్
Advertisement
Ads by CJ

నందమూరి తారకరత్న ఆరోగ్యం అంత్యంత విషమం అంటూ బెంగుళూరు నారాయణ హృదయాలయ డాక్టర్స్ ప్రకటించడంతో నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, టిడిపి కార్యకర్తలు తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేస్తున్నారు. తారకరత్న గుండె రక్షణాల్లోకి రక్త ప్రసరణ జరగడం లేదని, ప్రస్తుతం ఆయనకి కృత్రిమ శ్వాస అందిస్తున్నారని, ఆయన కోమాలోకి వెళ్లినట్టుగా ఆయన సోదరుడు చైతన్య కృష్ణ మీడియాతో మట్లాడారు. తారకరత్నకు గతంలో ఎలాంటి హెల్త్ ఇష్యుస్ లేవని, ప్రస్తుతం ఆయన కోలుకుంటారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అయితే సోదరుడిని చూసేందుకు జూనియర్ ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ లు ఈ రోజే బెంగుళూరుకు వెళుతున్నారన్నప్పటికీ.. రేపు ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ లు తారకరత్నని పరామర్శించేందుకు బెంగుళూర్ కి వెళ్ళబోతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ బెంగుళూరు ఆసుపత్రిలోనే తారకరత్న కుటుంబ సభ్యులకి తోడుగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శనివారం సాయంత్రం తారకరత్నని చూసేందుకు బెంగుళూరు వెళ్లారు.

తారకరత్నకి పదిమంది డాక్టర్స్ బృందం ఆధ్వర్యంలో చికిత్స జరుగుతుంది, ఈ డాక్టర్స్ బృందానికి ఉదయ్ నేతృత్వం వహిస్తున్నారు. కన్నడ హీరో శివరాజ్ కుమార్ తారకరత్నని చూసేందుకు ఈరోజు నారాయణ హృదయాల ఆసుపత్రికి వెళ్లారు.

NTR-Kalyan Ram go to Bangalore tomorrow:

Jr NTR, Kalyan Ram Visits Narayana Hrudayalaya Hospital

Tags:   JR NTR, KALYAN RAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ