నటి కీర్తి సురేష్ పెళ్లి పీటలెక్కబోతుంది అంటూ ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో కీర్తి సురేష్ ప్రేమలో ఉంది అన్నప్పటికీ.. అది నిజం కాదని ఆమె పేరెంట్స్ కొట్టి పారేసారు. కానీ ఇప్పుడు కొత్తగా ఓ యువ వ్యాపారవేత్తతో కీర్తి సురేష్ ప్రేమలో ఉంది.. త్వరలోనే ఆమె పెళ్లి అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగానే కీర్తి సురేష్ పై ఈ పెళ్లి వార్తలేమిటో అర్ధం కాక అభిమానులు తలపట్టుకుంటున్నారు.
మరోవైపు కీర్తి సురేష్ కోలీవుడ్ హీరో విజయ్ తో ప్రేమలో ఉంది.. విజయ్ ఏకంగా ఆయన భార్యకి విడాకులిచ్చేసి కీర్తి సురేష్ తో రెండో పెళ్ళికి రెడీ అయ్యాడంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. విజయ్ తాను ప్రేమించి పెళ్లాడిన భార్యకి ఈ వయసులో విడాకులు ఇచ్చేస్తున్నాడనే న్యూస్ ఆయన యాంటీ ఫాన్స్ పుట్టించారని అన్నారు.. ఇప్పుడు కీర్తి సురేష్ కోసమే విజయ్ భర్యకి విడాకులు ఇస్తున్నాడంటూ మరో కొత్త న్యూస్ పుట్టించారు.
మరి ఎన్ని వార్తలు ఎలా ఉన్న కీర్తి సురేష్ తన పెళ్లి విషయమై స్పందిస్తే ఓకె. లేదంటే ఇలాంటి వార్తలు ఇంకెన్ని ప్రచారంలోకొస్తాయో అని ఆమె అభిమానులు భయపడుతున్నారు.