నిన్న ఉదయం గుండెపోటుకు గురైన తారకరత్న ఆరోగ్యంపై బెంగుళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. తారకరత్న పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది అని వైద్యులు ప్రకటించారు. నిన్న కుప్పం ఆసుపత్రి నుండి బెంగుళూరు తరలించి నారాయణ హృదయాల ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తారకరత్న కి ఎక్మొ చికిత్స అందిస్తున్నారని, ఆయన వయసు తక్కువ కావడంతో అతని శరీరం ఎక్మొ చికిత్సకి కి సహకరిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది.
అలాగే కిడ్నీ చికిత్స జరుగుతుంది.. ఆయన కోలుకుంటున్నారని అన్నప్పటికీ.. కొద్దిసేపటి క్రితం నారాయణ హృదయాలయ వైద్య బృందం తారక రత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది అంటూ హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. ఇంకా కొన్ని గంటలు గడిస్తేనే కానీ ఏమి చెప్పలేమని చెప్పారు. ప్రస్తుతం సందర్శకులకు అనుమతి లేదని చెబుతున్నారు. బాలకృష్ణ, తారకరత్న కుటుంబ సభ్యులు తారకరత్నని జాయిన్ చేసిన హాస్పిటల్ లోనే ఉన్నారు. ఈరోజు సాయంత్రం చంద్రబాబు బెంగుళూరు వెళ్లనున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు బాలకృష్ణకి ఫోన్ చేసి ఆయన విషయాలు కనుక్కుంటున్నారు.