Advertisementt

జీ తెలుగులోకి జబర్దస్త్ టాప్ కమెడియన్స్

Sat 28th Jan 2023 01:24 PM
jabardasth nookaraju,punch prasad,zee telugu  జీ తెలుగులోకి జబర్దస్త్ టాప్ కమెడియన్స్
Jabardasth Top Comedians in Zee Telugu జీ తెలుగులోకి జబర్దస్త్ టాప్ కమెడియన్స్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం జబర్దస్త్ నుండి చాలామంది కమెడియన్స్ వెళ్లిపోయారు. అంతకుముందే నాగబాబు గారితో పాటుగా చమ్మక్ చంద్ర లాంటి టాప్ కమేడియన్స్ వెళ్లిపోగా.. కిర్రాక్ ఆర్పీ లాంటి వాళ్ళు కూడా అప్పట్లోనే నాగబాబు తో వెళ్లిపోయారు. ఇక కొద్దిరోజులుగా జబర్దస్త్ నుండి చాలామంది కమెడియన్స్ పక్క ఛానల్స్ కి మారిపోతున్నారు. అందులో సుడిగాలి సుధీర్ వెళ్ళిపోయాడు. మళ్ళీ జబర్దస్త్ కి వస్తా అన్నాడు ఇంతవరకు రానే లేదు. అలాగే అదిరే అభి.. ఇలా ఒక్కొక్కళ్ళుగా జబర్దస్త్ ని వదిలిపెడుతున్నారు. అయితే కొద్దిరోజులుగా జబర్దస్త్ కమెడియన్స్ పక్క ఛానల్స్ అయిన స్టార్ మా, జీ తెలుగు, జెమిని ఛానల్స్ లో స్పెషల్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఇటు జబర్దస్త్ ని అంటిపెట్టుకునే ఉంటున్నారు.

అయితే ఇప్పుడు జబర్దస్త్ లో ఫెమస్ అయిన నూకరాజు, పంచ్ ప్రసాద్ లు జీ ఛానల్ కి వెళుతున్నట్టుగా నూకరాజు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓ వీడియో షేర్ చేసాడు. తాను పంచ్ ప్రసాద్ అన్నా కలిసి జీ తెలుగు ఛానల్ వెళ్లిపోయామని, ప్రస్తుతం అక్కడ ఓ ప్రోగ్రాం కి అటెండ్ అవుతున్నామంటూ ఆ వీడియోలో చెప్పాడు. ఆ ప్రోగ్రాం ఏమిటో కూడా త్వరలోనే చెబుతామన్నారు.

అయితే వీరు పూర్తిగా జబర్దస్త్ ని వదిలేశారా.. లేదంటే జస్ట్ స్పెషల్ ప్రోగ్రాం కోసం వెళుతున్నారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Jabardasth Top Comedians in Zee Telugu:

Jabardasth Nookaraju and Punch Prasad in Zee Telugu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ