నటుడు తారకరత్న నిన్న లోకేష్ పాదయాత్రలో గుండెపోటుకు గురయ్యారు. తారకరత్న భార్య కోరికమేరకు ఆయనని కుప్పం ఆసుపత్రి నుండి శుక్రవారం మిడ్ నైట్ బెంగుళూర్ లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తారకరత్న కండిషన్ క్రిటికల్ గానే ఉంది, 24 గంటలు గడిస్తే కాని ఏమి చెప్పలేమునంటున్నారు డాక్టర్స్, గుండెకి ప్రత్యామ్నాయంగా ఎక్మో చికిత్సలో తారకరత్న ఉన్నట్లుగా సమాచారం. ఈరోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు బెంగుళూర్ కి వెళతారని, జూనియర్ ఎన్టీఆర్ కూడా తారకరత్నని పరామర్శించేందుకు బెంగుళూరుకి వెళ్లనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే బాలకృష్ణ తారకరత్న తో పాటుగా బెంగుళూరు బయలుదేరి వెళ్లారు.
నారాయణ హృదయాల డాక్టర్స్ ఉదయ్, రఘు బృందం ఆధ్వర్యంలోనే తారకరత్నకు అత్యాధునిక చికిత్సను అందిస్తున్నట్లుగా చెబుతున్నారు. తారకరత్నకు గుండెపోటు వచ్చిన సమయంలో బీపీ అధికంగా ఉండడం ద్వారానే బ్లీడింగ్ కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. బ్లీడింగ్ ని కంట్రోల్ చేసేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గుండెపోటు కారణంగానే ఈ విధంగా తీవ్ర రక్తస్రావంతో తారకరత్న బాధపడుతున్నట్లుగా చెబుతున్నారు.