Advertisementt

బాలయ్యకి జోడిగా కాజల్ అగర్వాల్

Sat 28th Jan 2023 11:48 AM
kajal,balakrishna,nbk108  బాలయ్యకి జోడిగా కాజల్ అగర్వాల్
Kajal to romance Balakrishna? బాలయ్యకి జోడిగా కాజల్ అగర్వాల్
Advertisement
Ads by CJ

పెళ్లి కి ముందు నుండే కాజల్ అగర్వాల్ సీనియర్ హీరోలకి కేరాఫ్ గా మారింది. చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 లో గ్లామర్ గా నటించింది. తర్వాత నాగార్జున తో ఘోస్ట్ చెయ్యాల్సిన కాజల్ అప్పుడు ప్రెగ్నెంట్ గా ఉండడంతో ఆ సినిమా నుండి తప్పుకుంది. ఆచార్యలో మరోసారి మెగాస్టార్ తో జోడి కట్టినా ఎడిటింగ్ లో ఆమె పాత్ర లేపేశారు. ఇప్పుడు బిడ్డ పుట్టాక కాజల్ అగర్వాల్ కమల్ హాసన్ తో ఇండియన్ 2 లో నటిస్తుంది. 

వీరసింహారెడ్డితో సక్సెస్ అందుకున్న నందమూరి నటసింహ బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న NBK108 కోసం ముందుగా బాలయ్య తో రొమాన్స్ చేసేందుకు హీరోయిన్ త్రిషని సంప్రదిస్తున్నారనే టాక్ నడిచింది. తాజాగా కాజల్ అగర్వాల్ పేరుని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. వీరసింహారెడ్డిలో శృతి హాసన్ తో చిందేసిన బాలయ్య.. అనిల్ రావిపూడి మూవీలో కాజల్ తో కలిసి అడుగేస్తారేమో చూడాలి. అన్నట్టు ఈ చిత్రంలో బాలయ్య నడి వయస్సు వ్యక్తిగా ఓ కూతురికి తండ్రిగా కనిపించబోతున్నారు. బాలయ్య కూతురిగా క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తుంది. మరి బాలయ్య పక్కన కాజల్ ఫైనల్ అయితే ఈ మూవీపై క్రేజీగా అంచనాలు పెరుగుతాయి.

Kajal to romance Balakrishna?:

Kajal to romance Balakrishna for NBK108

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ