Advertisementt

కన్ఫ్యూజన్ లో పవన్ ఫాన్స్

Sat 28th Jan 2023 11:16 AM
pawan kalyan,sujeeth  కన్ఫ్యూజన్ లో పవన్ ఫాన్స్
Pawan fans in confusion కన్ఫ్యూజన్ లో పవన్ ఫాన్స్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ రాజకీయంగా వారాహితో జనసైనికులకు పూనకాలు తెప్పిస్తున్నారు. పాలిటిక్స్ లో వారాహి యాత్రకి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఏర్పాట్లు చేస్తున్నారు. 2024 ఎన్నికల సమయానికి పవన్ కళ్యాణ్ రాజకీయంగా బాగా బిజీగా మారబోతున్నారు. కానీ మరోపక్క సినిమాల మీద సినిమాలు మొదలు పెడుతున్నారు. ఇప్పటికే హరి హర వీరమల్లు షూటింగ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో కొత్త ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ ని గత నెల డిసెంబర్ లో మొదలు పెట్టేసారు. ఆ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూట్ కి వెళ్లకముందే రేపు జనవరి 30 అంటే సోమవారం పవన్ కళ్యాణ్-సుజిత్ కాంబోలో దానయ్య నిర్మిస్తున్న సినిమాని పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టబోతున్నారు. 

పవన్ కళ్యాణ్ వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటే పవన్ ఫాన్స్ కి పండగే. కానీ రాజకీయాలంటూ పవన్ కళ్యాణ్ అటు టైమ్ స్పెండ్ చెయ్యడం, అందులో ఎలక్షన్స్ మూమెంట్ లో ఇలా సినిమాలు మొదలు పెట్టడంతో పవన్ ఫాన్స్ బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసే నిర్మాతలు, దర్శకులు టెన్షన్ పడాల్సింది పోయి ఇప్పుడు పవన్ ఫాన్స్ లో టెన్షన్ మొదలైంది. పవన్ కళ్యాణ్ వరసగా మొదలు పెడుతున్న సినిమాలు ఎప్పటికి పూర్తవ్వాలి అనేది వారి ఆలోచన. మరి ఈ విషయంలో పవన్ ఆలోచన ఎలా ఉందో కానీ.. సినిమాలు మాత్రం పూజా కార్యక్రమాలతో మొదలైపోతున్నాయి.

అటు రాజకీయాల్లో పూర్తిగా మిళితమవ్వాలంటే సినిమాలు పక్కనబెట్టాల్సిందే. అయితే సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చెయ్యొచ్చు. పూర్తిస్థాయి రాజకీయాల్లో పాల్గొనడానికి సినిమాలు అడ్డంకే. అందులోను ఎలక్షన్స్ మూమెంట్ ఇది మాములుగా ఉండదు. చూద్దాం పవన్ ఏం చేస్తారో అనేది.

Pawan fans in confusion:

Pawan Kalyan - Sujeeth OG Movie Pooja Ceremony on January 30

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ