ఈరోజు శుక్రవారం లోకేష్ పాదయాత్ర చేస్తున్న చోట స్పృహ తప్పి పడిపోయిన తారకరత్నకు కార్డియా అరెస్ట్ జరిగింది. తారకరత్నని కుప్పం లోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. తారకరత్న ని కుప్పం ఆసుపత్రిలో జాయిన్ చేసినప్పటినుండి బాలకృష్ణ అక్కడే ఉండి తారకరత్న పరిస్థితిపై ఎప్పటికప్పుడు డాక్టర్స్ తో మాట్లాడుతున్నారు. అయితే తారకరత్న గుండెలోని రక్తనాళాలులో 90 పర్సెంట్ బ్లాక్స్ ఏర్పడడంతో ఆయనకు స్టెంట్స్ వెయ్యాలని, అయినప్పటికీ మెరుగైన వైద్యం కోసం బెంగుళూరుకు తరలిస్తామని అన్నారు.
కాని తాజాగా తారకరత్న కి మరోసారి హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉండడంతో ఆయన్ని కుప్పం ఆసుపత్రిలోనే ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించారు. దాని కోసం నారాయణ హృదయాలయ నుండి వైద్యులని రప్పిస్తున్నారు. ఇక్కడే తారకరత్నకు వైద్యం అందించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించడంతో ఆయనని కుప్పం ఆసుపత్రిలోనే ఉంచేశారు. నారా లోకేష్, బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ తారకరత్నని పరామర్శించారు. తారకరత్నకు సెకండ్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉండడంతో ఆయనకి ఆర్టిఫీషియల్ హార్ట్ అమరికపై డాక్టర్స్ మధ్యన చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది.
అయితే ఉదయం కంటే తారకరత్న ఆరోగ్యం మెరుగైంది అని డాక్టర్స్ చెబుతున్నప్పటికీ.. టిడిపి కార్యకర్తలు, తారకరత్న అభిమానులు కుప్పం ఆసుపత్రికి భారీగా చేరుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ వారు పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు.