Advertisementt

అన్ స్టాపబుల్: పవన్ పెళ్ళిళ్ళపై ప్రోమో

Fri 27th Jan 2023 08:00 PM
nbk-pawan kalyan,unstoppable  అన్ స్టాపబుల్: పవన్ పెళ్ళిళ్ళపై ప్రోమో
NBK-PSPK Unstoppable new promo out అన్ స్టాపబుల్: పవన్ పెళ్ళిళ్ళపై ప్రోమో
Advertisement
Ads by CJ

బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కోసం పవన్ ఫాన్స్, ఇటు నందమూరి ఫాన్స్ మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. చిన్న చిన్న గ్లిమ్ప్స్ కూడా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. బాలయ్య పవన్ ని బ్రదర్ అంటూ సంభోదిస్తూ పవన్ ని ఓ స్నేహితుడిలా ట్రీట్ చేసిన విధానానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఇక తాజాగా పవన్-బాలయ్య ఎపిసోడ్ ప్రోమో ఒకటి వదిలారు. అందులో ఈశ్వరా పవనేశ్వరా అంటూ బాలయ్య పవన్ ని ఆటపట్టించారు. గుడుంబా శంకర్ సినిమాలో ప్యాంట్ మీద ప్యాంట్ వేసి 20 ఏళ్ళ తగ్గించావ్ అంటూ బాలయ్య అనగానే పవన్ మూసి ముసిగా నవ్వుకున్నాడు. అలాగే మనిద్దరం ఎప్పుడు కలిశామో తెలుసా అంటూ ఓ పిక్ చూపించారు బాలయ్య. దానిలో నేను కుర్రాడిలా ఉన్నాను కదా అనగానే మీరు ఇప్పటికీ కుర్రాడిగానే ఉన్నారని పవన్ ఫన్ చేసాడు.

తర్వాత సాయి ధరమ్ తేజ్ షోకి ఎంట్రీ ఇచ్చాడు. పంచె కట్టుకుని వచ్చిన సాయి తేజ్ ని చూసి ఇక్కడేమన్నా పెళ్లి చూపులు జరుగుతున్నాయనుకున్నావా అన్నారు బాలయ్య. సాయి తేజ్ ని తొడ కొట్టమనగానే సాయి తేజ్ బాలయ్య దగ్గరకి వెళ్లి ఆయన తొడ కొట్టబోయాడు. నా తొడ కాదు అంటూ బాలయ్య నవ్వించారు. తర్వాత పవన్ ని బాలకృష్ణ రామ్ చరణ్ తో ఫ్రెండ్ షిప్ గురించి, త్రివిక్రమ్ తో ఫ్రెండ్ షిప్ గురించి అడిగారు. ఆ తర్వాత సీరియస్ టోన్ తో నీ పెళ్లిళ్ల గొడవేమిటి భయ్యా అన్నారు. దానికి పవన్ గంభీరంగా.. వాళ్ళు బాధపడతారేమో అని గ్యాప్ ఇచ్చి నా ఉద్రేకం, నా సంస్కారం నన్ను మాట్లాడనివ్వకుండా చేసింది అన్నాడు పవన్. 

ఇంత మానసిక సంఘర్షణకు గురైన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఎలా అయ్యాడు అని బాలయ్య ప్రశ్నించారు. దానికి పవన్ కళ్యాణ్ ఫుల్ క్లారిటీ ఇచ్చినట్టుగా ఈ ప్రోమోలో చూపించారు. మరి పవన్ చెప్పబోయే ఆ ఆసక్తికర విషయాలేమిటో చూడాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు వెయిట్ చెయ్యాల్సిందే.

NBK-PSPK Unstoppable new promo out:

Balakrishna-Pawan Kalyan Unstoppable promo out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ