Advertisementt

ఒక్క సాంగ్: రెండు కోట్ల పారితోషకం

Fri 27th Jan 2023 07:20 PM
urvashi rautela,waltair veerayya  ఒక్క సాంగ్: రెండు కోట్ల పారితోషకం
What Is Urvashi Rautela Remuneration For An Item Song ఒక్క సాంగ్: రెండు కోట్ల పారితోషకం
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా ఫిల్మ్ అయినా, భారీ బడ్జెట్ సినిమా అయినా, చిన్న మూవీ అయినా.. హీరోయిన్స్ తో హీరోలు వేసే డ్యూయెట్స్ ఒక ఎత్తు.. స్పెషల్ సాంగ్, అందులోను స్పెషల్ హీరోయిన్ నర్తిస్తే మాస్ ఆడియన్స్ కి ఇచ్చే కిక్కే వేరు. అందుకే దర్శకులు హీరోలకి సరిపోయే హీరోయిన్స్ ని ఎంత బాగా సెట్ చేసుకుంటారో ఐటెం సాంగ్ కి సరిపోయే భామ కోసం అంతే స్పెషల్ ఇంట్రెస్ట్ పెడతారు. గతంలో స్పెషల్ సాంగ్స్ చెయ్యడానికి స్పెషల్ హీరోయిన్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు టాప్ హీరోయిన్స్ కూడా స్టార్ హీరోల సినిమాల్లో గెంతేస్తున్నారు. కాజల్, తమన్నా, శృతి హాసన్, సమంత ఇలా చాలామంది టాప్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్ లో కనబడి భారీ పారితోషకాలు అందుకున్నవారే.

అందుకే వాల్తేర్ వీరయ్య కోసం దర్శకుడు బాబీ బాలీవుడ్ భామని దింపాడు. అక్కడ హీరోయిన్స్ కి తక్కువ, ఐటెం గర్ల్స్ కి ఎక్కువ అన్న రీతిలో గ్లామర్ గా కనబడుతూ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న ఉర్వశిని తీసుకొచ్చి మెగాస్టార్ పక్కన బాస్ పార్టీలో స్టెప్స్ వేయించాడు. ఊర్వశి కూడా గ్లామర్ గా మెగాస్టార్ తో కలిసి కిక్కిచ్చే స్టెప్స్ వేసింది. అయితే ఇప్పుడు ఆ మూడు నిమిషాల పాట కోసం ఊర్వశి ఏకంగా 2 కోట్లు పారితోషకం కింద అందుకుంది అనే న్యూస్ చూసిన జనాలు నోరెళ్లబెడుతున్నారు.

వాల్తేర్ వీరయ్యలో విలనిజం చూపించిన ప్రకాష్ రాజ్ కే అంత రెమ్యునరేషన్ ఇవ్వని మేకర్స్.. కేవలం మూడు నిమిషాల సాంగ్ కోసం ఉర్వశికి ఆ రేంజ్ పారితోషకం ఇచ్చి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

What Is Urvashi Rautela Remuneration For An Item Song:

What Is Urvashi Rautela Remuneration For An Item Song in Waltair Veerayya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ