ఈరోజు లోకేష్ పాదయాత్ర చేపట్టిన సమయంలో తారక రత్న కళ్ళు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆయనని కుప్పం ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. తారకరత్నకి కార్డియా అరెస్ట్ జరగడంతోనే ఆయన పాదయాత్రలో సృహ తప్పిపడిపోయినట్లుగా డాక్టర్స్ ప్రకటించారు. తారకరత్నకు యాంజియోగ్రామ్ చెయ్యగా గుండెలోకి వెళ్లే రక్తనాళాలు 90 శాతం బ్లాక్ అవడంతో తారకరత్న పరిస్థితి ప్రస్తుతం క్రిటికల్ కండిషన్ లోనే ఉన్నట్లుగా నందమూరి బాలకృష్ణ మీడియా కి తెలియజేసారు.
తారకరత్నని ఆసుపత్రిలో చేర్చిన దగ్గర నుండి బాలకృష్ణ ఆసుపత్రి దగ్గరే ఉండి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం తారకరత్నకు ప్రమాదం లేదు కానీ.. ఆయనని మెరుగైన వైద్యం కోసం బెంగుళూరుకి తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని, ఆయన నాన్నమ్మ, తాతగార్ల ఆశీర్వాదంతో తారకరత్న కోలుకుంటాడని, అభిమానులు కంగారు పడవద్దని బాలయ్య చెప్పారు. టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా బాలయ్య వెంటే ఉండి అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తారకరత్నకు మెరుగైన వైద్యం కోసం ఆయన్ని హెలికాఫ్టర్ లో బెంగుళూరుకి తరలిస్తామని ఆయన కూడా చెప్పారు.
ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం స్టేబుల్ గానే ఉంది అని, డాక్టర్స్ అబ్జర్వేషన్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు డాక్టర్స్ తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల చెయ్యలేదు.