Advertisementt

తారకరత్నకు హార్ట్ ఎటాక్

Fri 27th Jan 2023 02:23 PM
tarakaratna,lokesh  తారకరత్నకు హార్ట్ ఎటాక్
Lokesh Yuvagalam: Tarakaratna gives scare తారకరత్నకు హార్ట్ ఎటాక్
Advertisement
Ads by CJ

నందమూరి తారకరత్న ఈరోజు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు కుప్పం వెళ్లారు. కుప్పంలో వరదరాజులు  ఆలయంలో పూజల అంతరం మసీదులో ఆయన లోకేష్ తో పాటుగా ప్రార్థనలను నిర్వహించారు. మసీదు నుంచి బయటకు వచ్చిన తర్వాత లోకేష్-తారకరత్న చుట్టూ టీడీపీ కార్యకర్తల తాకిడి ఎక్కువయింది. పాదయాత్రలో నడుస్తున్న సమయంలో తారకరత్న సొమ్మసిల్లి పడిపోవడంతో ఆయనని వెంటనే కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించారు. 

అయితే పాదయాత్రలో ఆయన ఊపిరిఆడక పడిపోయారని అందరూ అనుకున్నారు. కానీ తారక రత్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఆయనకి యాంజియోగ్రామ్ చేసి.. గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాక్ ఉందని గుర్తించి, వెంటనే స్టంట్ కూడా వేశారని టిడిపి నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. 

ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది అని వైద్యులు తెలిపారు. తారకరత్నని ఆసుపత్రిలో జాయిన్ చేసిన వంటనే బాలకృష్ణ హుటాహుటిన తారకరత్నని పరామర్శించేందుకు వెళ్లారు. ప్రస్తుతం తారకరత్నకు స్పృహ వచ్చినట్లుగా తెలుస్తుంది. 

Lokesh Yuvagalam: Tarakaratna gives scare:

Tarakaratna shifted to the hospital

Tags:   TARAKARATNA, LOKESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ