Advertisementt

KGF నటుడితో పెళ్లిపీటలెక్కిన హరిప్రియ

Fri 27th Jan 2023 01:08 PM
actor vasishta,hari priya wedding  KGF నటుడితో పెళ్లిపీటలెక్కిన హరిప్రియ
Vasishta and Hari Priya wedding pictures out KGF నటుడితో పెళ్లిపీటలెక్కిన హరిప్రియ
Advertisement
Ads by CJ

కన్నడ భామ హరిప్రియ తెలుగులో హీరోయిన్ గా నిలదొక్కుకోకపోయినా.. కన్నడ సినిమాలతో బాగా గుర్తింపు తెచ్చుకుంది. పిల్ల జమిందార్ లో నాని సరసన నటించిన హరిప్రియ బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్స్ సినిమాల్లోనూ నటించింది. అయితే కన్నడ నటుడు KGF ఫేమ్ వశిష్ఠ సింహతో కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న హరిప్రియ గత నెలలో నిశ్చితార్ధం చేసుకుంది. హరిప్రియ-వశిష్ఠ సింహ ల నిశ్చితార్ధం ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

తాజాగా పెద్దల అంగీకారంతో హరిప్రియ-వశిష్ఠ సింహ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిపోయింది. పలువురు సెలబ్రిటీలు వీరి వివాహానికి హాజరయ్యి.. నూతన వధువరులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులుకు సంబంధించిన ఫోటోలు షేర్‌ చేయడంతో.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. హరిప్రియ, వశిష్ఠ సింహకు నెటిజెన్స్, అలాగే అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Vasishta and Hari Priya wedding pictures out:

KGF 2 Actor Vasishta, Hari Priya Wedding Pics viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ