Advertisementt

విష్ణు ప్రియ ఇంట విషాదం

Fri 27th Jan 2023 11:20 AM
anchor vishnu priya  విష్ణు ప్రియ ఇంట విషాదం
Anchor Vishnu Priya Mother Passed Away విష్ణు ప్రియ ఇంట విషాదం
Advertisement
Ads by CJ

యాంకర్ విష్ణు ప్రియా అంటే తెలియని వారుండరు. ఈమధ్యన బుల్లితెర నటుడు మానస్ తో చేసిన డాన్స్ తో బాగా పాపులర్ అయిన విష్ణు ప్రియా గత కొంతకాలంగా యాంకరింగ్ కి దూరంగా ఉంటుంది. కారణం సినిమా ఆఫర్స్ కోసం ట్రై చేస్తుంది. తాజాగా విష్ణు ప్రియ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విష్ణు ప్రియ తల్లి గురువారం తుదిశ్వాస విడిచారు. తన తల్లి మరణ వార్తని స్వయంగా విష్ణు ప్రియానే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. 

తన తల్లితో విష్ణు ప్రియ కలిసున్న ఫొటో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది. మై డియర్ అమ్మ.. ఈ రోజు వరకు నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకు నీ పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తాను. నువ్వే నా బలం, నా బలహీనత. నీవు మాతో లేకపోయినా.. నువ్వు ప్రతిచోట, నా ప్రతి శ్వాసలో ఉంటావని నాకు తెలుసు. ఈ భూమి మీద నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు. అందుకు నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను.. అంటూ విష్ణు ప్రియా తల్లిని తలచుకుంటూ చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది.

విష్ణు ప్రియ తల్లి అనారోగ్య కారణాలతో మృతి చెందింది అని తెలిసిన బంధువులు, ఆమె స్నేహితులు విష్ణు ప్రియని ఓదారుస్తూ తమ సంతాపం తెలియజేస్తున్నారు.

Anchor Vishnu Priya Mother Passed Away:

Rest In Peace Amma: Vishnu Priya Emotional Post viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ