కొద్దిరోజులుగా అనారోగ్య కారణాలతో అటు సినిమా షూటింగ్ లకి ఇటు జిమ్ కి దూరంగా ఉంటున్న సమంత సోషల్ మీడియాని కూడా అవాయిడ్ చేసింది. లేదంటే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త పోస్ట్ లో, లేదంటే జిమ్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేసే ఆమె సోషల్ మీడియాకి కూడా గ్యాప్ ఇచ్చేసరికి అభిమానులు బెంగపెట్టేసుకున్నారు. యశోద రిలీజ్ అప్పుడు నీరసంగా, బలహీనంగా ఉన్న సమంత జస్ట్ ఓ ఇంటర్వ్యూతో సరిపెట్టేసింది. కానీ శాకుంతలం రిలీజ్ సమయానికి కాస్త కోలుకోవడంతో శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొనడమే కాదు ఆ తర్వాత సమంత నిత్యం జిమ్ లో వర్కవుట్స్ చేస్తుంది.
ఎప్పుడూ సరైన డైట్ ని ఫాలో అవుతూ.. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూతో గ్లామర్ ని పెంచుకునే సామ్.. కొద్దిరోజులుగా జిమ్ కి దూరమైనా.. మళ్ళీ ఇప్పుడు మునుపుటిలా రొటీన్ లోకి వచ్చేసింది. తాజాగా సమంత జిమ్ వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. క్లిష్టమైన సమయంలో నాకు తోడుగా నిలిచి, నాకు చేరువై, నాలో స్ఫూర్తి నింపిన హూ ఈజ్ గ్రావిటీ బ్యాండ్ ధన్యవాదాలు. సాధ్యమైనంతవరకు కఠినతరమైన డైట్ లో భాగంగా మనం తీసుకునే ఆహారం వలన మనకు బలం రాదని.. అది మన ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుంది అనేది నా అభిప్రాయం అంటూ రాసుకొచ్చింది సమంత.
సమంత జిమ్ వీడియో కి ఆమె రాసిన నోట్ కి పలువురు సెలబ్రిటీస్ రిప్లై కూడా ఇస్తున్నారు. అందులో వెంకటేష్ కూతురు ఆశ్రీత కూడా ఉంది.