మాస్ మహారాజ్ రవితేజ గత ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్ తో బాగా డల్ అయ్యాడు. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ రెండు సినిమాలు రవితేజకి కోలుకోలేని షాకిచ్చాయి. కానీ ధమాకా అనుకోకుండా రవితేజకి పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చినట్టు అయ్యింది. నెగెటివ్ టాక్ తోనే 100 కోట్ల మార్క్ ని సునాయాసంగా అందుకుంది. వరసగా ధమాకా అలాగే వాల్తేర్ వీరయ్య హిట్స్ తో రవితేజ ఫుల్ జోష్ లోకి వచ్చేసాడు. కేవలం 20 రోజుల గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన రవితేజ ఈ ఏడాది రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు లను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధం చేస్తున్నాడు.
నేడు రిపబ్లిక్ డే అలాగే రవితేజ పుట్టిన రోజు రెండు కలిసి రావడంతో రవితేజ లేటెస్ట్ మూవీ రావణాసుర నుండి గ్లిమ్ప్స్ విడుదల చేసారు మేకర్స్. రవితేజ పవర్ ఫుల్ పాత్రలో రావణాసుర గా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో అక్కినేని హీరో సుశాంత్ కూడా నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం రవితేజ బర్త్ డే స్పెషల్ గా వదిలిన రావణాసుర గ్లిమ్ప్స్ చూసిన ఆయన అభిమానులు సర్ ప్రైజ్ ఫీలవుతున్నారు. రవితేజ అన్నకి పర్ఫెక్ట్ బర్త్ డే విషెస్ అంటూ హ్యాపీ మోడ్ లో కేక్ కట్ చేస్తూ రవితేజ బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. రవితేజ బర్త్ డే సందర్భంగా ఆయనకి సినీజోష్ టీమ్ తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే..