Advertisementt

విక్రమ్ ని ఫాలో అవుతున్నారు

Thu 26th Jan 2023 11:23 AM
venky 75th movie,saindhav  విక్రమ్ ని ఫాలో అవుతున్నారు
Venkatesh Following Vikram విక్రమ్ ని ఫాలో అవుతున్నారు
Advertisement
Ads by CJ

గత ఏడాది లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్-ఫహద్ ఫాసిల్-విజయ్ సేతుపతి కలయికలో వచ్చిన విక్రమ్ మూవీ పాన్ ఇండియా ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. అనిరుధ్ రవిచంద్ర మ్యూజిక్ ని పార్ట్ లు పార్ట్ లుగా ఇప్పటికి మ్యూజిక్ లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. కమల్ హాసన్ పవర్ ఫుల్ కేరెక్టర్, విజయ్ సేతుపతి విలనిజం, అన్నిటికి మించి ఫహద్ ఫాసిల్ పెరఫార్మెన్స్, లోకేష్ డైరెక్షన్ అన్నీ ఆడియన్స్ ని 100 పర్సెంట్ శాటిస్ఫాయ్ చేసాయి. అటు బాక్సాఫీసు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో కమల్ ని సంతోషపెట్టడంతో కమల్ హాసన్ విక్రమ్ యూనిట్ కి కాస్ట్లీ బహుమతులని ఇచ్చారు.

అయితే ఇప్పుడు అదే విక్రమ్ ఫార్ములాని ఫాలో అవుతూ సైంధవ్ పోస్టర్ మీద నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. హిట్ సీరీస్ తో బెస్ట్ డైరెక్టర్ అనిపించుకున్న శైలేష్ కొలను తన మూడో సినిమాకే వెంకటేష్ లాంటి సీనియర్ హీరో తో సినిమా చేస్తున్నాడు.  శైలేష్ కొలను ఇప్పుడు వెంకీ ని కూడా విక్రమ్ లా గన్ పట్టించాడు. విక్రమ్ మూవీలో కమల్ హాసన్ మాదిరి లుక్, అలాగే చేతిలో ఆ గన్ అన్ని చూసేసరికి శైలేష్ కొలను కూడా కమల్ విక్రమ్ ని ఫాలో అవుతున్నాడనిపించేలా ఈ సైంధవ్ ఉంది అంటున్నారు. 

కొంతమంది వెంకటేష్ ఘర్షణ మూవీ లో కనిపించినట్టే ఉంది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి సైంధవ్ గ్లిమ్ప్స్ తోనే వెంకీ పాత్రని ఆల్మోస్ట్ అందరికి అర్ధమయ్యే రీతిలో శైలేష్ చూపించేసాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా భాగం కాబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. 

Venkatesh Following Vikram:

First look of Venky 75th movie Saindhav

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ