బిగ్ బాస్ లోకి వెళితే సినిమా అవకాశాలు వస్తాయి, క్రేజ్ పెరుగుతుంది.. అన్నిటికి మించి పారితోషకాలు ఎక్కువ వస్తాయని ఆశించి చాలామంది బిగ్ బాస్ లోకి అడుగుపెడుతున్నారు. అయితే సౌత్ బిగ్ బాస్ లో టైటిల్ గెలిచిన వారికే ఎలాంటి ఆఫర్స్ రావడం లేదు. వారు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా చెప్పుకోవడం తప్ప పెద్దగా సాధించింది ఏమి లేదు. ఇంతవరకు బిగ్ బాస్ విన్నర్స్ ఒక్కరూ క్రేజీగా ఆఫర్స్ పట్టి నిలదొక్కుకున్న దాఖలా లేదు. బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ దగ్గర నుండి నిన్నగాక మొన్న సీజన్ 6 విన్నర్ రేవంత్ వరకు ఎవ్వరూ కెరీర్ లో బిజీగా కనిపించలేదు. ఇక కంటెస్టెంట్స్ సంగతి వేరే చెప్పాలా.. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక వేరే ఛానల్ కి వెళ్లే అవకాశమూ కోల్పోతున్నారు.
అందుకే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టేందుకు ఇప్పుడు చాలామంది అలోచించి అడుగులు వేస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ కి కొంతకాలంగా కంటెస్టెంట్స్ కరువవడంతో వారు యూట్యూబ్ లో కాస్త ఫెమస్ అయిన వారిని తీసుకొచ్చి హౌస్ లోకి పంపుతున్నారు. వారెవరో తెలియక బుల్లితెర ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. దానితో బిగ్ బాస్ కి వచ్చే కంటెస్టెంట్స్ కి సినిమాల అవకాశాలు లేకపోయినా.. స్టార్ మా ఉందిగా అంటూ వారికీ స్టార్ మాలో అవకాశాలు ఇస్తున్నారు. గత సీజన్, ఈ సీజన్ నుండి బయటికి వచ్చిన కంటెస్టెంట్స్ కి స్టార్ మా లో BB జోడి, స్టార్ మా పరివార్ లీగ్, ఇంకా ఇప్పుడు సీరియల్స్. గత సీజన్ నుండి వచ్చిన మానస్ ని హీరోగా పెట్టి బ్రహ్మముడి సీరియల్ స్టార్ట్ చేసారు స్టార్ మా వాళ్ళు. అదే సీజన్ లో వచ్చిన హమీద కూడా ఈ సీరియల్ లో నటిస్తుంది. ఇక ఈ సీజన్ లో కనిపించిన వాసంతి ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారులో మెయిన్ లీడ్ లో కనబడుతుంది.
అదే స్టార్ మా లో మానసిచ్చి చూడు, కార్తీక దీపం సీరియల్స్ తో ఫెమస్ అయిన కీర్తి భట్ ఈ బిగ్ బాస్ సీజన్ లో టాప్5 లో నిలిచి తన కన్నీటి కథతో అందరికి దగ్గరైంది. అదే కీర్తి భట్ రియల్ లైఫ్ తో ఇప్పుడు మధురానగరిలో అనే కొత్త సీరియల్ స్టార్ట్ చెయ్యబోతున్నారు. సో బిగ్ బాస్ లోకి వెళితే ఇకపై స్టార్ మా లో అవకాశాలే అవకాశాలు. పక్క ఛానల్ కి వెళ్లే అవకాశం లేకపోయినా, వెండితెర అవకాశం రాకపోయినా.. స్టార్ మా ఉందిగా అంటూ కొత్త కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ లోకి ఆహ్వానిస్తున్నారు.