బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి-క్రికెటర్ కాల్ రాహుల్ ల వివాహం జనవరి 23న ఖండాల ఫామ్ హౌస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి అయితే వైభవంగా జరిగినా అతియా-రాహుల్ ల రిసెప్షన్ మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ వలన వాయిదా పడింది. అలాగే రాహుల్-అతియాల హనీమూన్ కూడా ఈ లీగ్ వలనే వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తుంది . అయితే అతియా-రాహుల్ వివాహం ఎంత గ్రాండ్ గా జరిగిందో అంతే కాస్ట్లీ గిఫ్ట్స్ వీరి పెళ్ళికి వచ్చినట్లుగా సమాచారం. ముఖ్యంగా సునీల్ శెట్టి తన కూతురు కోసం ముంబైలోని కాస్ట్లీ ఏరియాలో 50 కోట్ల విలువగల ఫ్లాట్ ని గిఫ్ట్ గా ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
అలాగే టీమ్ ఇండియా క్రికెటర్స్ లో విరాట్ కోహ్లీ రాహుల్ కోసం 2.17 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారుని బహుమతిగా అందించినట్టుగా టాక్. సల్మాన్ ఖాన్ అయితే 1.64 కోట్ల విలువైన ఆడి కారుని గిఫ్ట్ గా ఇచ్చారట. ఇక హీరో అర్జున్ కపూర్ 1.5 కోట్ల డైమండ్ బ్రేస్లెట్ ఇవ్వగా.. ధోని 80 లక్షల విలువైన కావాస బైక్ ని బహుమతి ఇచ్చారని, జాకీ ష్రాఫ్ 30 లక్షలు విలువైన వాచ్ ని బహుకరించినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
ప్రస్తుతం అతియా శెట్టి-KL రాహుల్ ల పెళ్ళికి వచ్చిన బహుమతులు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఇవన్నీ చూసిన వారు ఇకపై సునీల్ శెట్టి ఇచ్చే రిసెప్షన్ విందు ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించుకుంటే.. కునుకు రాదేమో అంటున్నారు.