Advertisementt

సైంధవ్ గా విక్టరీ వెంకటేష్

Wed 25th Jan 2023 03:24 PM
venky75,saindhav  సైంధవ్ గా విక్టరీ వెంకటేష్
Venky75 Titled released సైంధవ్ గా విక్టరీ వెంకటేష్
Advertisement
Ads by CJ

విక్టరీ వెంకటేష్ F3 తర్వాత ఓరి దేవుడా చేసారు. ఆ సినిమా తర్వాత వెంకటేష్ భారీ గ్యాప్ తీసుకుని తన ల్యాండ్‌మార్క్ 75వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ ల్యాండ్ మార్క్ చిత్రం కోసం HIT తో విజయాల్ని అందించిన డైరెక్టర్ శైలేశ్ కొల‌నుతో చేతులు కలిపారు. తమ గత చిత్రాలతో బ్లాక్‌బస్టర్‌లను అందించిన స్టార్, దర్శకుడు, నిర్మాత నుంచి దేశవ్యాప్తంగా ఆకట్టుకునేలా రూపొందిస్తున్న ఈ చిత్రంపై సహజంగానే అంచనాలు భారీగా వున్నాయి.

మేకర్స్ ఈరోజు వెంకటేష్-శైలేష్ కొలను కలయికలోని చిత్ర టైటిల్ పోస్టర్‌, గ్లింప్స్ ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి సైంధవ్ అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. వెంకటేష్ పవర్ ఫుల్ లుక్ లో చేతిలో తుపాకీ పట్టుకుని టెర్రిఫిక్ గా కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక కారు, పేలుడును చూడవచ్చు. టైటిల్ పోస్టర్‌లో సైంధవ్ యాక్షన్‌లో ఎక్కువగా వుంటుందని, వెంకటేష్ ఇంటెన్స్ పాత్రలో నటిస్తున్నారని అర్ధమౌతుంది.

వెంకటేష్ ఒక మెడిసన్ వయాల్ ఉన్న కూల్ బాక్స్‌తో చంద్రప్రస్థ అనే ఓడరేవు ప్రాంతంలోకి ఇంటరై, అక్కడ కంటైనర్ నుంచి తుపాకీని బయటకు తీస్తాడు. చివరగా గూండాల గ్యాంగ్ ని ఉద్దేశించి.. నేనిక్కడే వుంటార్రా... ఎక్కడికి ఎళ్ళను... రమ్మను.. అంటూ హెచ్చరించడం గ్లింప్స్ లో ప్రెసెంట్ చేశారు.  

త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభిస్తామని కూడా మేకర్స్ ప్రకటించారు. ఇది వెంకటేష్‌ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం.

Venky75 Titled released :

Venky75 Titled Saindhav

Tags:   VENKY75, SAINDHAV
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ