కోలీవుడ్ నటుడు బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోని మలేషియాలో బిచ్చగాడు 2 షూటింగ్ లొకేషన్ లో జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలపై ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న విషయం తెలిసిందే. విజయ్ ఆంటోని బిచ్చగాడు 2 షూటింగ్ లో బోట్ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. అయితే అప్పటినుండి విజయ్ ఆంటోని హెల్త్ బులిటెన్ విడుదల చెయ్యలేదు. ఈలోపు మీడియాలో విజయ్ ఆంటోని ఆరోగ్యంపై ఆందోళకరమైన వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కొంతమంది ఆయన కోమాలోకి వెళ్లారంటే కొంతమంది ఆయన మొహానికి తగిలిన గాయాల వలన ప్లాస్టిక్ సర్జరీ చేసారంటూ రకరకాలుగా మాట్లాడారు.
అయితే తాజాగా విజయ్ ఆంటోని తన ఆరోగ్యంపై సోషల్ మీడియా ద్వారా అప్ డేట్ ఇచ్చాడు. ఆసుపత్రి బెడ్ మీద నుండే థంబ్ చూపిస్తూ తన ఆరోగ్యంపై అప్ డేట్ ఇచ్చాడు. డియర్ ఫ్రెండ్స్ మలేషియాలో బిచ్చగాడు 2 షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాను. ఈ ప్రమాదంలో నా ముక్కు, నా దవడ భాగాలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆ గాయాల నుండి కోలుకుంటున్నాను, ఇప్పుడే మేజర్ సర్జరీ పూర్తయ్యింది, త్వరలోనే మీ అందరితో మాట్లాడతాను. ఈ కఠినమైన పరిస్థితుల్లో నాకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలంటూ ట్వీట్ చేసాడు.
విజయ్ ఆంటోని ఆరోగ్యంపై వస్తున్న వార్తలకి విజయ్ ఇలా చెక్ పెట్టగా.. ఆయన కోలుకుంటున్న విషయం తెలిసి విజయ్ ఆంటోని అభిమానులు ఆనందపడుతున్నారు. త్వరగా కోలుకుని ఎప్పటిలా మాములుగా సినిమాలు చెయ్యాలంటూ దేవుడిని ప్రార్థిస్తున్నారు.