Advertisementt

శర్వానంద్ నిశ్చితార్థం డేట్ ఫిక్స్

Wed 25th Jan 2023 10:29 AM
sharwanand  శర్వానంద్ నిశ్చితార్థం డేట్ ఫిక్స్
Sharwanand engagement date is fixed శర్వానంద్ నిశ్చితార్థం డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

ఎట్టకేలకి హీరో శర్వానంద్ పెళ్లి పీటలెక్కడానికి రెడీ అయ్యాడు. పెళ్లి వయసు వచ్చి వెళ్ళిపోయినా పెళ్లి విషయంలో కామ్ గా ఉన్న చాలామంది హీరోలు కరోనా లాక్ డౌన్ లోనే ఓ ఇంటి వారయ్యారు. నిఖిల్, నితిన్, రానా ఇలా చాలామంది పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడు శర్వానంద్ కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్దమయ్యాడు. అది కూడా ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు నడవబోతున్నాడు. శర్వంనంద్ ఇంట పెళ్లి పనులు షురూ అయ్యాయి. శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో వివరాలు కూడా బయటకి వచ్చేసాయి.

ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ మనవరాలు, హై కోర్ట్ న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డిని శర్వానంద్ ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. రక్షిత రెడ్డి అమెరికాలో సాఫ్ట్ వెర్ ఇంజినీర్ గా వర్క్ చేస్తుంది. లాక్ డౌన్ సమయం నుండి ఆమె హైదరాబాద్ లోనే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ రక్షిత రెడ్డి హైదరాబాద్ లోనే ఉండడం, ఫైనల్ గా శర్వానంద్ తో ఆమె ఏడడుగులు వేసేందుకు సిద్దమవడంతో ఇరు కుటుంబాల వారు వీరి పెళ్లిని చేసేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 26 అంటే రిపబ్లిక్ డే రోజున శర్వానంద్-రక్షిత రెడ్డిల వివాహ నిశ్చితార్ధం జరగబోతుంది. త్వరలోనే పెళ్లి ముహుర్తాలు కూడా పెట్టుకుంటారని తెలుస్తుంది.

Sharwanand engagement date is fixed:

Sharwanand Marriage and engagement date fixed

Tags:   SHARWANAND
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ