Advertisementt

లవర్ పై శృతి హాసన్ హాట్ కామెంట్స్

Tue 24th Jan 2023 09:42 PM
shruti haasan,shantanu  లవర్ పై శృతి హాసన్ హాట్ కామెంట్స్
Shruti Haasan hot comments on Lover Shanthanu లవర్ పై శృతి హాసన్ హాట్ కామెంట్స్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో ఈమధ్యన శృతి హాసన్ బాగా హాట్ టాపిక్ గా నిలిచింది. ఎందుకంటే ఆమె నటించిన రెండు సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలయ్యాయి. ఆ సినిమాల ప్రమోషన్స్ లో కనిపించని శృతి హాసన్ ని నెటిజెన్స్ ట్రోల్ చేసారు. ఎందుకంటే ఇక్కడ సినిమాల ప్రమోషన్స్ టైమ్ లో ఆమె ఫీవర్ అని చెప్పి తన లవర్ శాంతానుతో ముంబైలో చెట్టాపట్టాలేసుకుని తిరగడం చూసిన వారు ఆమెని ట్రోల్ చేసారు. అయితే ఆ రెండు సినిమాల విడుదల తర్వాత శృతి హాసన్ ఆ సినిమాల్లో ఎందుకు నటించిందో ఎవరికీ అర్ధం కాలేదు.

ఎప్పటికప్పుడు ప్రియుడు శాంతానుతో ఉన్న ఫొటోస్ ని షేర్ చేసే శృతి హాసన్ మొన్నామధ్యన శాంతను తో ఉన్న పిక్స్ పోస్ట్ చెయ్యకుండా కామ్ గా ఉండేసరికి చాలామంది వారి మధ్యలో ఏదో జరిగింది, బ్రేకప్ కూడా అయ్యింది అనే న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. తర్వాత శృతి హాసన్ శాంతను ఫొటోస్ ని షేర్ చేసేసరికి అదంతా జస్ట్ రూమర్ అని తేలిపోయింది. అయితే తాజాగా శృతి హాసన్ లవర్ శాంతను తో ఉన్న పిక్ ని షేర్ చేస్తూ ఓ స్టోరీ పోస్ట్ చేసింది. 

ఈ ప్రపంచంలో నీకంటే నన్ను ఇంకెవరూ సంతోషంగా చూసుకోలేరు అంటూ ఫన్నీ ఎమోజిలానీ పెట్టి తన ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం శృతి హాసన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Shruti Haasan hot comments on Lover Shanthanu:

Shruti Haasan talks about her relationship with Shantanu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ