అసలు ఆస్కార్ అవార్డు రావడం ఏమో కానీ.. ఆ ఆస్కార్ బరిలో నామినేట్ అవడమే ఒక ప్రతిష్టాత్మకమైన విషయం. ఇండియా ఆడియన్స్, సినీ లవర్స్, తెలుగు ప్రేక్షకుల కల సాకారమయ్యే సమయం దగ్గర పడింది. పడింది కాదు వచ్చేసింది. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు కోసం RRR చిత్రం నామినేషన్ సాధించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అవార్డులు, రివార్డులు కొల్లగొడుతున్న ఆర్.ఆర్.ఆర్ ఇప్పుడు ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. ఈ ఏడాది అవార్డుల వేడుకలో ఆస్కార్‌ను సాధించడానికి RRR సిద్దమైంది.
ఆస్కార్ బరిలో ఆర్.ఆర్.ఆర్ నుండి ఒరిజినల్ సాంగ్ కేటగిరి లో నాటు నాటు సాంగ్ నామినేట్ అయ్యింది. కొద్దిసేపటి క్రితమే ఈ ప్రకటన వెలువడింది. ఈ రోజు మంగళవారం భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకి ఈ ప్రకటన వెలువడింది. పలు కేటగిరీల కోసం నామినేషన్లు ప్రకటించారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో రాజమౌళి దర్శకత్వంలో కీరవాణి మ్యూజిక్ అల్బర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ లు నర్తించిన ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ నామినేట్ అయిందని ప్రకటించారు.
దానితో ఇండియా వైడ్ ప్రేక్షకులు ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు, ఎన్టీఆర్-రామ్ చరణ్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆస్కార్ లో తెలుగోడి సత్తా మొదలైంది అంటూ కేరింతలు పెడుతున్నారు.