గత ఏడాది గ్లామర్ డాల్ పూజ హెగ్డే కి మూడు బిగ్ షాక్ లు తగిలాయి. పూజ హెగ్డే ఎన్నో ఆశలు పెట్టుకున్న పాన్ ఇండియా ఫిల్మ్ రాధే శ్యామ్ ఘోరమైన డిసాస్టర్ అవ్వగా.. తమిళంలో విజయ్ బీస్ట్ తో భీభత్సమైన ప్లాప్ అందుకుంది. బాలీవుడ్ అయినా ఊరటనిస్తోంది అనుకుంటే హిందీ ఫిల్మ్ సర్కస్ చెప్పుకోలేని డిసాస్టర్ గా మిగిలిపోయింది. అయితే పూజ హెగ్డే కి ఇప్పుడు ఉన్నది మహేష్ బాబు SSMB28 మాత్రమే. ఇది తప్ప తెలుగులో మరో సినిమా చెయ్యడం లేదు. ఈ సినిమా కూడా పూజ హెగ్డే కి మొదలు కాకముందే షాకిచ్చింది అనే టాక్ టాలీవుడ్ లో నడుస్తుంది.
అంటే ఈ చిత్రంలోకి అదిరిపోయే హీరోయిన్ శ్రీలీల అడుగుపెట్టడంతో పూజ హెగ్డే పాత్రకి అన్యాయం చేయబోతున్నారట త్రివిక్రమ్. అసలే త్రివిక్రమ్ కి పూజ హెగ్డే అంటే కొద్దిగా సెంటిమెంట్. అందుకే మూడోసారి ఆమెకి ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు చూస్తే త్రివిక్రమ్ శ్రీలీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పూజ హెగ్డే పాత్రకి అన్యాయం చెయ్యబోతున్నారు అంటున్నారు. ఎందుకంటే రెండు ప్లాప్ సినిమాలతో శ్రీలీల పేరు మాత్రం మార్మోగిపోయింది. ఆమె ఎనేర్జి లెవల్స్, ఆమె డాన్స్ స్కిల్స్, ఆమె అందమైన రూపం, గ్లామర్ అన్నిటికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
దానితో శ్రీలీలని సెకండ్ హీరోయిన్ స్థాయి నుండి పూజ హెగ్డే కన్నా ప్రాధాన్యత ఉన్న పాత్ర స్థాయికి మార్చేసారట. అంటే ఈ లెక్కని పూజ హెగ్డే శ్రీలీల తో ఈక్వల్ అనేకంటే.. సెకండ్ హీరోయిన్ స్థాయికి పడిపోతుందేమో అనే ఊహాగానాలు పూజ అభిమానుల్లో మొదలయ్యాయి.