పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర ప్రారంభించేందుకు ఓ ప్రచార రథాన్ని సిద్ధం చేసుకుని దానికి వారాహిగా నామకరణం చేసి.. ఈరోజు తన వాహనం వారాహికి కొండగట్టు ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేయించేందుకు కొండగట్టు బయలుదేరి వెళ్లారు. జనసైనికులు భారీ కాన్వాయ్‌తో పవన్ వెంట వెళ్లారు. పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహికి అంజన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. వేద పండితులు ప్రత్యేకంగా పూజలు చేసి ప్రచార రథాన్ని ప్రారంభించారు. అనుష్టుప్ నారసింహ యాత్రకు శ్రీకారం చుట్టేందుకు కొండగట్టుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ కి భారీ ఆదరణ లభించింది. ఆయన కోసం వచ్చిన జనంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోవడం మాత్రమే కాదు కొండగట్టుకు బయలుదేరిన పవన్ కళ్యాణ్ కి అడుగడుగునా జన నీరాజనాలు దక్కాయి.
అయితే పవన్ కళ్యాణ్ కి ఎంతగా హ్యూజ్ రెస్పాన్స్ దక్కిందో అంతే సెటేరికల్ కామెంట్స్ పడడం గమనార్హం. పవన్ కళ్యాణ్ కొండగట్టుకు బయలు దేరిన సమయంలో ఆయన మార్గ మధ్యలో తలకి ముస్లిం టోపీ ధరించారు. మెడలో తువ్వాలు వేసుకుని నెత్తికి టోపీ పెట్టుకుని అచ్చంగా ముస్లింలా కనిపించారు. ఇక కొండగట్టుకు చేరుకోగానే పవన్ కళ్యాణ్ హిందూ సంప్రదాయంలోకి మారిపోయి హిందూ గెటప్ వేశారు. పవన్ కళ్యాణ్ సినిమా ఫక్కీలో మార్చిన గెటప్ లు ఆయనని విమర్శలపాలు చేసింది. సినిమాల్లో గెటప్స్ వేసే పవన్ రాజకీయాల్లోనూ గెటప్స్ మారుస్తున్నారంటూ కొంతమంది సెటైర్స్ వేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ వారాహికి పూజలు జరిపించేందుకు వెళ్లిన సమయంలో అటు వైసిపి నాయకులు కొందరు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి నోటీసులు అందడంపై టెన్షన్ గా ఉండి పవన్ కళ్యాణ్ని పట్టించుకోలేదు. కానీ ఓ వర్గం మాత్రం పవన్ కళ్యాణ్ పై ఈ గెటప్స్ మార్చే విషయంలో సెటైర్స్ పేలుస్తుంది.