కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం తునివి తో సక్సెస్ అందుకున్నారు. తునివి చిత్రం డివైడ్ టాక్ తోనే కోట్లు కొల్లగొట్టాడు. అయితే అజిత్ కథల ఎంపికలో అసలు ఇంట్రెస్ట్ చూపించకుండా సినిమాలు చేస్తున్నాడంటూ ఇప్పుడు తునివి రిజల్ట్ తర్వాత అజిత్ పై విమర్శలు ఎక్కువయ్యాయి. అజిత్ కథలు ఎంపికలో మరికాస్త జాగ్రత్తలు పాటించాలంటూ ఆయన అభిమానులే అజిత్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు కూడా.. ప్రస్తుతం తునివి సినిమా తర్వాత అజిత్ కుమార్ నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో AK62 చెయ్యబోతున్నారు. అయితే ఈ చిత్రంలో అజిత్ సరసన ఫస్ట్ హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ ఆల్మోస్ట్ ఫిక్స్ అంటున్నారు. ముందుగా నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.. ఎలాగూ విగ్నేష్ దర్శకత్వం కదా అనుకున్నారు.
తర్వాత AK62 లో హీరోయిన్ గా త్రిష నటించబోతుంది.. హీరోయిన్ గా త్రిష నే ఫైనల్ అన్నారు. మధ్యలో సాయి పల్లవి జాక్ పాటు కొట్టేసింది. అజిత్ సరసన ఛాన్స్ పట్టేసింది అన్నారు. ఇప్పుడు కొత్తగా కీర్తి సురేష్ అజిత్ సరసన హీరోయిన్ గా నటించవచ్చు.. అంటున్నారు. ఇద్దరు హీరోయిన్స్ లో ఒకరు ఐశ్వర్య రాయ్ కాగా.. రెండోవారు కీర్తి సురేష్ ఫైనల్ అవ్వొచ్చని, విగ్నేష్ శివన్ ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాడంటున్నారు.
మరి కీర్తి సురేష్ కి గనక ఈ అజిత్ సినిమా అవకాశం దొరికితే ఆమె కల నెరవేరినట్లే. ఎందుకంటే ఈ మధ్యనే కీర్తి సురేష్ అజిత్ సినిమాలో నటించాలనే కోరికని బయటపెట్టింది. ఇప్పుడు నిజంగా ఆ ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తుంది.