పవన్ కళ్యాణ్ ఈరోజు తన వారాహి వాహనం పూజ కోసం కొండగట్టు వెళ్లారు. అక్కడ పూజానంతరం ఆయన రాజకీయంగా బిజీగా మారుతున్నారు. అయితే గత నెల డిసెంబర్ లోనే క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు మేజర్ షెడ్యూల్ పూర్తి చేసారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్ లో 45 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ కి సంబందించిన టీజర్ ని రిపబ్లిక్ డే అంటే జనవరి 26న హరి హర వీరమల్లు టీజర్ వదలబోతున్నట్టుగా నిర్మాత AM రత్నం ఎప్పుడో చెప్పారు.
మరి జనవరి 26కి ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. కానీ ఇంతవరకు చిత్ర బృందం హరి హర వీరమల్లు టీజర్ పై ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. చిత్రం బృందం అంతా సైలెంట్ మోడ్ లో ఉంది. క్రిష్ కానీ, మేకర్స్ కానీ హరి హర వీరమల్లు టీజర్ అప్ డేట్ ఇస్తారని పవన్ కళ్యాణ్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి జనవరి 26న టీజర్ ఇస్తున్నాం గెట్ రెడీ ఫాన్స్ అని చెప్పడం లేదు. పవన్ కళ్యాణ్ యాక్షన్ విన్యాసాల కోసం ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.
నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. అయితే రిపబ్లిక్ డే రోజున టీజర్ తో పాటుగా.. హరి హర వీరమల్లు డేట్ కూడా ఇస్తే బావుంటుంది అనేది పవన్ ఫాన్స్ ఫీలింగ్. కానీ అసలు మేకర్స్ టీజర్ విషయమే తేల్చకుండా సైలెంట్ గా ఉన్నారు.