బిగ్ బాస్ సీజన్ 6 లో ఎవ్వరూ ఎక్స్ప్రెక్ట్ చెయ్యని ఎలిమినేషన్ లో మొదటగా గీతూ రాయల్ దే అని చెప్పాలి. విపరీతమైన తెలివితేటలున్న గీతూ రాయల్ ని ఓ వర్గం ఆడియన్స్ ఇష్టపడితే కొంతమంది ఆమె తెలివితేటలని భరించలేకపోయారు. గీతూ ఓవర్ కాన్ఫిడెన్స్ కి ఎలిమినేషన్ తో చెక్ పెట్టారు. లూప్ లతో బిగ్ బాస్ గేమ్ ని మలుపు తిప్పగలిగే గీతూ చేసిన ఓవరేక్షన్ ఎక్కువైంది. ప్రతి వారం నాగార్జున పొగుడుతుండేసరికి ఆమెకి ఆ పొగరు మరింతగా ఎక్కువైంది.
టాస్క్ లో మొదటి రౌండ్ లోనే ఓడిపోయి సంచాలక్ గా మారాక గీతూ చేసిన రచ్చ అటు ఆడియన్స్ కి నచ్చలేదు, ఇటు నాగార్జునకి నచ్ఛలేదు. హౌస్ మేట్స్ కి అస్సలు నచ్చలేదు. అలాగే మరో పాజిటివ్ కంటెస్టెంట్ బాలాదిత్య పై గీతూ రాయల్ చేసిన సిగరెట్ ఎమోషన్ గొడవ ఆమెపై నెగిటివిటీని పెంచింది. దానితో గీతూ రాయల్ ని ఆడియన్స్ బయటికి పంపేసారు. ఇప్పుడు గీతూ కూడా అదే ఒప్పుకుంటుంది. నా ఓవరేక్షన్ భరించలేకే ఆడియన్స్ నన్ను బయటికి పంపేశారు.
నేను సంచాలక్ గా చేసిన పని, బాలాదిత్య అన్న విషయంలో చేసిన పని నచ్ఛలేదు కాబట్టే నన్ను ఎలిమినేట్ చేసారు. అంతేకాదు ఈ అమ్మాయి బాగా ఆడుతుంది. ఎలాగైనా సేవ్ అవుతుంది అని ఓట్స్ వెయ్యలేదు. అందుకే ఈ ఎలిమినేషన్ అని చెప్పింది. సదరు యాంకర్ అయితే నీ అతి భర్తించలేకే ప్రేక్షకులు నీ మీద చిరాకు పడి నిన్ను ఎలిమినేట్ చెయ్యాలనే కసితో ఓట్స్ వెయ్యలేదు అంటున్నారు. అవును నా తెలివితేటలకు చిరాకు పడి నన్ను బయటికి పంపేశారు అంటూ గీతూ ఆ ఇంటర్వ్యూలో నిజాలు ఒప్పుకుంది.